DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/policec07ea17d-d812-4c6a-a8d6-2ba183aae783-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/policec07ea17d-d812-4c6a-a8d6-2ba183aae783-415x250-IndiaHerald.jpgమనం ఏదైనా మోసానికి గురైనా.. ఓ సంస్థ వల్ల నష్టపోయామని భావించినా పోలీసులను ఆశ్రయిస్తాం. మనకి జరిగిన అన్యాయాన్ని వివరించి న్యాయం చేయాలని కోరుతాం. ఆ న్యాయం చేసే అధికారే మోసపోతే ఎవరకి చెప్పుకుంటాడు. తనపై అకారణంగా చేయి చేసుకున్నాడని ఓ పోలీస్ ఉన్నతాధికారికి ఓ ఐటీ ఉద్యోగి ఝులక్ ఇచ్చారు. హైటెక్ పోలీసులగా చెప్పుకునే తెలంగాణ శాఖ పోలీసులనే ఖంగుతినేలా చేశారు. ఆ అధికారి చరవాణీ నంబర్ సేకరించి దానిని హ్యాక్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ ఫోన్ ని తన నియంత్రణలోకి తెచ్చుకొని ఇతరులతో చేసిన వాట్సప్ చాటింగ్ వివరాలు, వ్యక్తPOLICE{#}Traffic police;Smart phone;police;WhatsApp;Telanganaఆ పోలీస్‌ ఫోన్‌ హ్యాక్.. అందరి జాతకాలు అందులోనే?ఆ పోలీస్‌ ఫోన్‌ హ్యాక్.. అందరి జాతకాలు అందులోనే?POLICE{#}Traffic police;Smart phone;police;WhatsApp;TelanganaMon, 16 Oct 2023 05:00:00 GMTమనం ఏదైనా మోసానికి గురైనా.. ఓ సంస్థ వల్ల నష్టపోయామని భావించినా పోలీసులను ఆశ్రయిస్తాం. మనకి జరిగిన అన్యాయాన్ని వివరించి న్యాయం చేయాలని కోరుతాం. ఆ న్యాయం చేసే అధికారే మోసపోతే ఎవరకి చెప్పుకుంటాడు. తనపై అకారణంగా చేయి చేసుకున్నాడని ఓ పోలీస్ ఉన్నతాధికారికి ఓ ఐటీ ఉద్యోగి ఝులక్ ఇచ్చారు. హైటెక్ పోలీసులగా చెప్పుకునే  తెలంగాణ శాఖ పోలీసులనే ఖంగుతినేలా చేశారు. ఆ అధికారి చరవాణీ నంబర్ సేకరించి దానిని హ్యాక్ చేసి  షాక్ ఇచ్చాడు.


ఫోన్ ని తన నియంత్రణలోకి తెచ్చుకొని ఇతరులతో చేసిన వాట్సప్ చాటింగ్ వివరాలు, వ్యక్తిగత విషయాలు కొల్లగొట్టాడు. తిరిగి ఆ అధికారికే ఆ వీడియోలు, సందేశాలు పంపాడు. దీంతో ఖంగుతినడం ఆ అధికారి వంతైంది. ఇటీవల ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా ర్యాలీలు తీస్తుంటే పోలీసులు తమపై చేయి చేసుకున్నారని ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. ‘ప్రభుత్వాలు వస్తుంటాయి. మారుతూ ఉంటాయి. కానీ పోలీస్ శాఖ శాశ్వతం. వారు రాజకీయ నేతల అండదండలతో పనిచేస్తే మా సత్తా ఏంటో చూపిస్తాం”. ఆరోజు తమ పట్ల దురుసుగా వ్యవహరించిన ప్రతి ఒక్క పోలీసు అధికారి, సిబ్బంది ఫోన్లలోని డేటాను బయట పెడతామని హెచ్చరిస్తున్నారు.  ఇది కేవలం పోలీస్ శాఖమే పరిమితం కాదని.. ప్రతి అధికారి, రాజకీయ నేత కు వర్తిస్తుందని పేర్కొన్నారు.  ప్రస్తుతం ఈ అంశం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.


పోలీస్ ఉన్నతాధికారి ఫోన్ హ్యాక్ కి గురవడం పట్ల వారు చాలా సీరియస్ గా ఉన్నారు.  హ్యాకింగ్ గురిచేసిన వ్యక్తిని గుర్తించడం పోలీస్ శాఖను పెద్ద సమస్యేమీ కాదు. కానీ మీ అందరి ఫోన్లను హ్యాక్ చేస్తామని చెప్పి అధికారులను, పోలీస్ సిబ్బందిని, రాజకీయ నేతలను బెదిరించడం సరికాదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని వారు హెచ్చరిస్తున్నారు. ర్యాలీలు తీయాలంటే పోలీస్ శాఖ లేదా కోర్టుల ద్వారా అనుమతి పొందాలి కానీ ఇలా బెదిరింపులకు పాల్పడవద్దని సూచిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కేసీఆర్‌ మేనిఫెస్టో.. జనం చెవుల్లో గులాబీ పువ్వులా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>