EducationPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/ap-polytechnicb6f4ad0b-5e65-4e86-bbe6-f87a3ffffd5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/ap-polytechnicb6f4ad0b-5e65-4e86-bbe6-f87a3ffffd5b-415x250-IndiaHerald.jpgఏపీలో పాలిటెక్నిక్‌ విద్యను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు చేయడంతో పాటు మొట్టమొదటిసారి సాంకేతిక విద్యా, శిక్షణ మండలి ద్వారా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇండస్ట్రీ కనెక్ట్‌ పేరుతో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ విద్యార్థులకు బోధన సమయంలోనే లభించేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.ఆ కోర్సు పూర్తయ్యేలోగా విద్యార్థులకు మెరుగైన కొలువులు లభించేలా సంస్కరణలు తెచ్చింది. ఇంకా అలాగే రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్AP POLYTECHNIC{#}Qualification;Application;INTERNATIONAL;Industry;Governmentఏపీ: పాలిటెక్నిక్‌ విద్య మరింత బలోపేతం?ఏపీ: పాలిటెక్నిక్‌ విద్య మరింత బలోపేతం?AP POLYTECHNIC{#}Qualification;Application;INTERNATIONAL;Industry;GovernmentMon, 16 Oct 2023 19:59:23 GMTఏపీలో పాలిటెక్నిక్‌ విద్యను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు చేయడంతో పాటు మొట్టమొదటిసారి సాంకేతిక విద్యా, శిక్షణ మండలి ద్వారా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇండస్ట్రీ కనెక్ట్‌ పేరుతో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ విద్యార్థులకు బోధన సమయంలోనే లభించేలా కూడా  ప్రభుత్వం చర్యలు తీసుకుంది.ఆ కోర్సు పూర్తయ్యేలోగా విద్యార్థులకు మెరుగైన కొలువులు లభించేలా సంస్కరణలు తెచ్చింది. ఇంకా అలాగే రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలుండగా మొదటి దశలో 41 కాలేజీలకు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రెడిటేషన్‌(ఎన్‌బీఏ) గుర్తింపు లభించేలా ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే మొత్తం తొమ్మిది కాలేజీల్లోని 16 ప్రోగ్రామ్‌లకు ఎన్‌బీఏ గుర్తింపు లభించింది.మిగిలిన 32 కాలేజీలు కూడా ఈ విద్యా సంవత్సరం చివరి నాటికి ఎన్‌బీఏ గుర్తింపు పొందేందుకు రెడీ అయ్యాయి. 


వీటిలోని 5 కాలేజీల్లో చాలా రకాల తనిఖీలు పూర్తవ్వగా.. ఈనెల చివరి వారంలో మరో 5 కాలేజీల్లో ఎన్‌బీఏ బృందాల సందర్శనకు షెడ్యూల్‌ కన్ఫర్మ్ అయ్యింది.అలాగే రెండో దశలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరంలో మరో 43 కాలేజీలకు ఎన్‌బీఏ గుర్తింపు లభించేలా సాంకేతిక విద్యా శాఖ ప్రయత్నిస్తుంది. వృత్తి విద్యా రంగంలో నాణ్యత, కొలువులు సాధించే సామర్థ్యాలను నిర్ధారించే అంతర్జాతీయ ప్రమాణాల అక్రెడిటింగ్‌ ఏజెన్సీగా ఇండియాలో ఎన్‌బీఏ వ్యవహరిస్తోంది.విద్యార్థుల సంఖ్య, అధ్యాపకుల నిష్పత్తి, పీహెచ్‌డీ స్థాయి అర్హతలు, ఆర్థిక వనరుల వినియోగం, ఐపీఆర్‌-పేటెంట్లు, స్వీయ మూల్యాంకనం, జవాబుదారీతనం ఇంకా నిపుణుల తయారీ వంటి అంశాలను ఎన్‌బీఏ పరిశీలిస్తుంది.వీటి ఆధారంగా పాలిటెక్నిక్‌ కాలేజీలకు గుర్తింపునిస్తుంది.ఇక ప్రభుత్వం ఇటీవల కొత్తగా 3 పాలిటెక్నిక్‌ కాలేజీలను ప్రారంభించింది. వీటికి 3 సంవత్సరాల తర్వాతే ఎన్‌బీఏ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది.ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల విద్యార్థులకు బోధన సమయంలోనే ఉపాధి లభించేలా వివిధ పరిశ్రమలతో సాంకేతిక విద్యా శాఖ 674 అవగాహన ఒప్పందాలను చేసుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా పోస్ట్ పోన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>