Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea5df47c6-e951-446c-8af2-7e2888f9a0e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea5df47c6-e951-446c-8af2-7e2888f9a0e0-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరో లలో ఒకరైన రవితేజ గూర్చి కొన్ని ఆసక్తికర విషయాలలో భాగంగా రవితేజ ఇండస్ట్రీలో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మాస్ మహారాజగా ఎదిగాడు. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు మాస్ మహారాజ్ గా ఎదిగాడు. ఇన్నాళ్లు తెలుగు ఆడియన్స్ ని మాత్రమే అలరిస్తూ వచ్చిన రవితేజ.. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ ని కూడా పలకరించబోతున్నాడsocialstars lifestyle{#}Cheque;Mass;Industry;Akkineni Nagarjuna;India;ravi teja;Ravi;Akkineni Nageswara Rao;Hero;Cinema;Telugu;Directorనాగార్జున చేతుల మీద ఫస్ట్ రెమ్యూనరేషన్ చెక్ అందుకున్న స్టార్ హీరో ....!!నాగార్జున చేతుల మీద ఫస్ట్ రెమ్యూనరేషన్ చెక్ అందుకున్న స్టార్ హీరో ....!!socialstars lifestyle{#}Cheque;Mass;Industry;Akkineni Nagarjuna;India;ravi teja;Ravi;Akkineni Nageswara Rao;Hero;Cinema;Telugu;DirectorMon, 16 Oct 2023 14:55:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరో లలో ఒకరైన రవితేజ గూర్చి కొన్ని ఆసక్తికర విషయా లలో భాగం గా రవితేజ ఇండస్ట్రీ లో ఏ బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా వచ్చి మాస్ మహారాజగా ఎదిగాడు. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌ గా, అసిస్టెంట్ డైరెక్టర్‌ గా ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు మాస్ మహారాజ్ గా ఎదిగాడు. ఇన్నాళ్లు తెలుగు ఆడియన్స్ ని మాత్రమే అలరిస్తూ వచ్చిన రవితేజ.. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ ని కూడా పలకరించబోతున్నాడు.

ఇప్పుడు ఒక్కో సినిమాకి కోట్ల లో రెమ్యూనరేషన్ తీసుకునే రవితేజ.. మొదటి రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా..? ఆ పారితోషకాన్ని ఎవరి చేతులు మీదుగా తీసుకున్నాడో తెలుసా..? రవితేజ కెరీర్ విషయానికి వస్తే.. 1990 నుంచి చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చాడు. వాటికీ రోజు వారి వేతనం అందుకునేవాడు. అయితే 1996 లో ఒక సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. అప్పుడే మొదటిసారి అధికారికంగా రెమ్యూనరేషన్ చెక్ అందుకున్నడు.

కృష్ణవంశీ దర్శకత్వం లో నాగార్జున హీరో గా తెరకెక్కిన ఇండస్ట్రీ హిట్ మూవీ ‘నిన్నే పెళ్ళాడతా’. ఈ సినిమా కి రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఇక ఈ మూవీకి గాను రవితేజ.. నాగార్జున చేతుల మీదుగా మొదటి రెమ్యూనరేషన్ చెక్ ని అందుకున్నాడు. ఆ చిత్రానికి రూ.3500 రెమ్యూనరేషన్ ని రవితేజ తీసుకున్నాడు. ఆ చెక్ ని రవితేజ చాలా ఏళ్ళు దాచుకున్నాడట. అయితే ఒక సమయంలో డబ్బులు లేక.. దానిని బ్యాంకు లో డిపాజిట్ చేసి మనీ తీసుకున్నాడట. అలాగే ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమా లో రవితేజ ఒక చిన్న పాత్ర కూడా చేశాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లియో: డే 1 అన్ని కోట్ల వసూళ్లు ఖాయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>