Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccca1a36e6-3771-4776-ba73-dc363744d87c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccca1a36e6-3771-4776-ba73-dc363744d87c-415x250-IndiaHerald.jpgవరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న పోరులో ఏ టీమ్ విజేతగా నిలుస్తుంది అన్నది ముందుగా ఊహించడం కూడా కష్టంగానే మారిపోతుంది. ఎందుకంటే భారీ అంచనాలు మధ్య టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక నిరాశ పరుస్తూ ఉంటే.. అంచనాలు లేకుండా పసికూన టీమ్స్ గా వరల్డ్ కప్ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన టీమ్స్ మాత్రం అదరగొడుతున్నాయ్ అని చెప్పాలి. అంచనాలకు మించి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఇక ఇIcc{#}Afghanistan;England;history;World Cup;Cricketఒకే ఒక్క గెలుపుతో.. చరిత్ర సృష్టించిన ఆప్ఘనిస్తాన్?ఒకే ఒక్క గెలుపుతో.. చరిత్ర సృష్టించిన ఆప్ఘనిస్తాన్?Icc{#}Afghanistan;England;history;World Cup;CricketMon, 16 Oct 2023 09:50:00 GMTవరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న పోరులో ఏ టీమ్ విజేతగా నిలుస్తుంది అన్నది ముందుగా ఊహించడం కూడా కష్టంగానే మారిపోతుంది. ఎందుకంటే భారీ అంచనాలు మధ్య టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక నిరాశ పరుస్తూ ఉంటే.. అంచనాలు లేకుండా పసికూన టీమ్స్ గా వరల్డ్ కప్ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన టీమ్స్ మాత్రం అదరగొడుతున్నాయ్ అని చెప్పాలి.


 అంచనాలకు మించి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఇక ఇటీవల వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది. వరల్డ్ కప్ ఛాంపియన్గా కొనసాగుతున్న టీం ఏదైనా ఉంది అంటే అది ఇంగ్లాండ్ అనే చెప్పాలి. వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా ఉంది. ఇక టైటిల్ ఫేవరెట్ గా కూడా బరిలోకి దిగింది. ఒకరకంగా ఇంగ్లాండ్ తో మ్యాచ్ అంటే చాలు ప్రత్యర్తి టీమ్స్ కూడా భయపడిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అలాంటి ఇంగ్లాండ్ టీం ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోవడాన్ని అసలు నమ్మలేకపోతున్నారు క్రికెట్ ప్రేక్షకులు.


 ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ ను మట్టి కరిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డే ఫార్మాట్లో ఆ జట్టుపై ఆఫ్ఘనిస్తాన్ కు ఇదే తొలి విజయం అని చెప్పాలి. అలాగే టెస్టులు ఆడుతున్న దేశం పై వరల్డ్ కప్ లో గెలవడం కూడా ఆఫ్ఘనిస్తాన్ కు ఇదే మొదటిసారి. వరుసగా 14 ఓటముల తర్వాత విజయం సాధించింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. అయితే వరల్డ్ ఛాంపియన్గా ఉన్న ఇంగ్లాండ్ పై 2011లో ఐర్లాండ్, 2017లో బంగ్లాదేశ్, ఇప్పుడు 2023లో ఆఫ్ఘనిస్తాన్ లాంటి పసికూన టీమ్స్ గెలిచి చరిత్ర సృష్టించాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య లాస్ట్ 6 మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>