MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak77df29c8-bf88-4dba-9a55-2b8788fcbaf7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak77df29c8-bf88-4dba-9a55-2b8788fcbaf7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ కొంత కాలం క్రితం "దాస్ కా దమ్కి" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఈ నటుడు హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఇకపోతే ఇందులో విశ్వక్ డ్యూయల్ రోల్ లో నటించాడు. విశ్వక్ ఈ మూవీ లో ఒక పాత్రలో సాఫ్ట్ కార్నర్ లో కనిపించగా ... మరొక పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి రెండు డిఫరెంట్ షేడ్స్ గల పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇకపోతే ఈ మూవీ లో నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటVishwak{#}nivetha pethuraj;rao ramesh;Yuva;Viswak sen;neha shetty;Evening;cinema theater;Saturday;October;Cinema;Hero;televisionఆరోజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా "దాస్ కా దమ్కి"..!ఆరోజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా "దాస్ కా దమ్కి"..!Vishwak{#}nivetha pethuraj;rao ramesh;Yuva;Viswak sen;neha shetty;Evening;cinema theater;Saturday;October;Cinema;Hero;televisionMon, 16 Oct 2023 11:00:00 GMTటాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ కొంత కాలం క్రితం "దాస్ కా దమ్కి" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఈ నటుడు హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఇకపోతే ఇందులో విశ్వక్ డ్యూయల్ రోల్ లో నటించాడు. విశ్వక్ ఈ మూవీ లో ఒక పాత్రలో సాఫ్ట్ కార్నర్ లో కనిపించగా ... మరొక పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి రెండు డిఫరెంట్ షేడ్స్ గల పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు.

ఇకపోతే ఈ మూవీ లో నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించగా ... రావు రమేష్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా ఆ తర్వాత కొన్ని రోజులకే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి "ఓ టి టి" ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది. ఇక ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించబోతుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా అక్టోబర్ 21 వ తేదీన శనివారం రోజు సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ సినిమాలు ఛానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరి థియేటర్ ... "ఓ టి టి"  ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తోందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం విశ్వక్ "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య లాస్ట్ 6 మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>