Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/australia-c2853bcf-02db-4a2c-86b2-91f2dfc6250d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/australia-c2853bcf-02db-4a2c-86b2-91f2dfc6250d-415x250-IndiaHerald.jpgవరల్డ్ క్రికెట్లో ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా కు భారత్ వేదికగా జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్ లో మాత్రం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి అని చెప్పాలి. ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేసి పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో కొనసాగే ఆస్ట్రేలియా.. ఇక ఇప్పుడు మాత్రం చెత్త ప్రదర్శనతో నిరాశ పరుస్తూనే ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో కూడా ఓటమి చవిచూసి పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతుంది ఆస్ట్రేలియా. ఏకంగా చాంపియన్ టీం గా పేరున్న ఆస్ట్రేలియా పరిస్థితి చూసి ప్రస్తుతం క్రికెట్ విశ్లేషAustralia {#}Netherlands;Good news;Good Newwz;South Africa;Australia;World Cup;Cricket;India;Octoberపాకిస్తాన్తో మ్యాచ్ కు ముందు.. ఆస్ట్రేలియాకు బిగ్ గుడ్ న్యూస్?పాకిస్తాన్తో మ్యాచ్ కు ముందు.. ఆస్ట్రేలియాకు బిగ్ గుడ్ న్యూస్?Australia {#}Netherlands;Good news;Good Newwz;South Africa;Australia;World Cup;Cricket;India;OctoberMon, 16 Oct 2023 11:30:00 GMTవరల్డ్ క్రికెట్లో ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా కు భారత్ వేదికగా జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్ లో మాత్రం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి అని చెప్పాలి. ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేసి పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో కొనసాగే ఆస్ట్రేలియా.. ఇక ఇప్పుడు మాత్రం చెత్త ప్రదర్శనతో నిరాశ పరుస్తూనే ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో కూడా ఓటమి చవిచూసి పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతుంది ఆస్ట్రేలియా.


 ఏకంగా చాంపియన్ టీం గా పేరున్న ఆస్ట్రేలియా పరిస్థితి చూసి ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకులు సైతం షాక్ లో మునిగిపోతూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా వరుసగా రెండు ఓటములతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా మూడో మ్యాచ్లో మాత్రం విజయం సాధించాలని భావిస్తుంది. కాగా మూడో మ్యాచ్ పటిష్టమైన పాకిస్తాన్తో జరగబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే పాకిస్తాన్తో మ్యాచ్ కు ముందే అటు ఆస్ట్రేలియా జట్టుకు ఒక గుడ్ న్యూస్ అందింది అన్నది తెలుస్తుంది. వరల్డ్ కప్ కి ముందు సౌత్ ఆఫ్రికా టూర్ సందర్భంగా ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న ట్రావెస్ హెడ్ గాయపడ్డాడు.


 దీంతో ఇప్పుడు వరకు వరల్డ్ కప్ జట్టులో అతను చేరలేదు. అయితే ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్ స్టేషన్లో పాల్గొన్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతను అక్టోబర్ 25వ తేదీన నెదర్లాండ్స్ తో జరగబోయే మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో హెడ్ కు చోటు లభించిన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకుంటే ఇక అతని సేవలను వినియోగించుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సిద్ధంగా ఉంది. అందుకోసమే ఇప్పటివరకు అతను గాయం బారిన పడిన కూడా అతనికి రీప్లేస్మెంట్ గా ఎవరిని ఎంపిక చేయలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లియో: డే 1 అన్ని కోట్ల వసూళ్లు ఖాయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>