LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tipsf83c7607-8d79-4fe8-986e-3ba80e7d06a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tipsf83c7607-8d79-4fe8-986e-3ba80e7d06a7-415x250-IndiaHerald.jpgమనం సాధారణంగా చాలా రకాల వంటకాలను తయారు చేసుకొని తింటూ ఉంటాము. అయితే మనం ఈ వంటకాలను తయారు చేయడానికి అల్యూమినియం, స్టీల్ ఇంకా నాన్ స్టిక్ తో తయారు చేసిన వంట పాత్రలను ఎక్కువగా వాడుతూ ఉంటాము.అయితే మనం వాడే వంట పాత్రలను బట్టి మనం చేసే వంటల రుచితో పాటు మన శరీర ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. నాన్ స్టిక్ వంట పాత్రలను టెప్లాన్ వంటి ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలతో తయారు చేస్తారు.కాబట్టి వీటిని వాడకూడదని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. చాలా మందికి వంటలు చేయడానికి అల్యూమినియంతో చేసిన వంట పాత్రలను వాడాలా లేదHealth tips{#}vegetable market;Manamవంటలకు ఏ పాత్ర వాడితే మంచిది?వంటలకు ఏ పాత్ర వాడితే మంచిది?Health tips{#}vegetable market;ManamMon, 16 Oct 2023 18:35:00 GMTమనం సాధారణంగా చాలా రకాల వంటకాలను తయారు చేసుకొని తింటూ ఉంటాము. అయితే మనం ఈ వంటకాలను తయారు చేయడానికి అల్యూమినియం, స్టీల్ ఇంకా నాన్ స్టిక్ తో తయారు చేసిన వంట పాత్రలను ఎక్కువగా వాడుతూ ఉంటాము.అయితే మనం వాడే వంట పాత్రలను బట్టి మనం చేసే వంటల రుచితో పాటు మన శరీర ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. నాన్ స్టిక్ వంట పాత్రలను టెప్లాన్ వంటి ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలతో తయారు చేస్తారు.కాబట్టి వీటిని వాడకూడదని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. చాలా మందికి వంటలు చేయడానికి అల్యూమినియంతో చేసిన వంట పాత్రలను వాడాలా లేదా స్టీల్ తో తయారు చేసిన వంట పాత్రలను వాడాలా అనే డౌట్ ఉంటుంది. అసలు వంట చేయడానికి స్టీల్ వంట పాత్రలు మంచివా లేదా అల్యూమినియం వంట పాత్రలు మంచివా అసలు ఈ రెండింటిలో దేనిని వాడాలి వంటి వివరాలను పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం.


సాధారణంగా అల్యూమినియం వంట పాత్రలు మనకు చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. వీటిని గ్యాస్, ఒవెన్ వంటి వాటిపై ఈజీగా ఉపయోగించవచ్చు. అలాగే వీటిని ఈజీగా శుభ్రం చేసుకోవడానికి, దీర్ఘకాలం పాటు మన్నికంగా ఉండడానికి వీటిని హార్డ్ యానోడైజ్డ్ అల్యూమినియంతో తయారు చేస్తాయి.ఇంకా అలాగే కొన్నింటిని నాన్ యానోడైజ్డ్ అల్యూమినియంతో తయారు చేస్తారు. అయితే ఇవి ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉండవు.ఇక అల్యూమినియం వంట పాత్రల్లో వండడం వల్ల మనం తయారు చేసే వంట సమానంగా ఉడుకుతుంది. ఇంకా అలాగే నిమ్మ, టమాట వంటి వాటిని కూడా మనం ఈ పాత్రల్లో ఈజీగా వండుకోవచ్చు. అల్యూమినియం పాత్రల్లో వండడం వల్ల వీటిలో ఉండే ఆమ్లత్వం ఎలాంటి ప్రతిచర్య జరగకుండా ఉంటుంది.అల్యూమినియం పాత్రల్లో వండడం మంచిదే అయినప్పటికి మంచి నాణ్యమైన, హార్డ్ యానోడైజ్డ్ అల్యూమినియంతో తయారు చేసిన వంట పాత్రలనే ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


అయితే కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో బాదపడే వారు అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది. అలాగే స్టీల్ తో తయారు చేసిన వంట పాత్రలను కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాము. మనకు మార్కెట్ లో నాణ్యమైన స్టీల్ తో తయారు చేసిన వంట పాత్రలు ఈజీగా లభిస్తున్నాయి. ఇవి కూడా చాలా కాలం పాటు స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇవి 500 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత దాకా ఇవి తట్టుకోగలవు.ఇంకా అలాగే వీటిని శుభ్రం చేయడం కూడా చాలా సులభం.స్టెయిన్ లెస్ స్టీల్ వంట పాత్రలను ఉపయోగించడం మరింత మంచిదని వీటిని వాడడం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా పోస్ట్ పోన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>