MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3c1e243b-cbc0-4371-a340-a2dbe4cb4c94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3c1e243b-cbc0-4371-a340-a2dbe4cb4c94-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ కామెడీ షో ఎందరికో జీవితాన్ని ఇచ్చింది. ఈ షో ద్వారా కమెడియన్గా గుర్తింపును తెచ్చుకున్న చాలామంది కమెడియన్స్ ప్రస్తుతం సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది హీరోలుగా కూడా మారారు. కేవలం హీరోగానే కాదు కొంతమంది కమెడియన్స్ మెగా ఫోన్ పట్టి ఏకంగా సినిమాలను సైతం డైరెక్ట్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కమెడియన్ వేణు గురించి. సినిమాల్లో కామెడీ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఆ తర్వాత జబర్దస్త్ షో తో బుల్లితెర ఆడియన్స్ ను అలరించాడు. రీసెంట్ గా మెగాఫోన్ tollywood{#}KCR;ananya;getup srinu;Jabardasth;Comedian;Ananya Nagalla;Venu Thottempudi;Rocking Rakesh;Comedy;Audience;Pooja Hegde;Smart phone;Ananya Pandey;Posters;Minister;Event;Telangana;Cinemaహీరోగా మారిన రాకింగ్ రాకేష్ ..!!హీరోగా మారిన రాకింగ్ రాకేష్ ..!!tollywood{#}KCR;ananya;getup srinu;Jabardasth;Comedian;Ananya Nagalla;Venu Thottempudi;Rocking Rakesh;Comedy;Audience;Pooja Hegde;Smart phone;Ananya Pandey;Posters;Minister;Event;Telangana;CinemaSun, 15 Oct 2023 10:39:11 GMTజబర్దస్త్ కామెడీ షో ఎందరికో జీవితాన్ని ఇచ్చింది. ఈ షో ద్వారా కమెడియన్గా గుర్తింపును తెచ్చుకున్న చాలామంది కమెడియన్స్ ప్రస్తుతం సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది హీరోలుగా కూడా మారారు.  కేవలం హీరోగానే కాదు కొంతమంది కమెడియన్స్ మెగా ఫోన్ పట్టి ఏకంగా సినిమాలను సైతం డైరెక్ట్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కమెడియన్ వేణు గురించి. సినిమాల్లో కామెడీ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఆ తర్వాత జబర్దస్త్ షో తో బుల్లితెర ఆడియన్స్ ను అలరించాడు. రీసెంట్ గా మెగాఫోన్ పట్టి 'బలగం' అనే సినిమాని తెరకెక్కించాడు. ఆ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే. 

 రీసెంట్ గా గెటప్ శ్రీను కూడా హీరోగా మారి 'రాజు యాదవ్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇదే జబర్దస్త్ షో నుంచి మరో కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తాజాగా రాకింగ్ రాకేష్ నటిస్తున్న చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ని అనౌన్స్ చేశారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా మల్లారెడ్డి యూనివర్సిటీలో 50 అడుగుల కటౌట్ తో 50,000 మంది స్టూడెంట్స్ సమక్షంలో టైటిల్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. 

ఈ చిత్రానికి 'KCR' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. 'కెసిఆర్' అంటే 'కేశవ చంద్ర రమావత్' అని అర్థం. టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కటౌట్ ముందు ఒక పిల్లాడు నిలుచుని ఉన్నట్లు ఈ పోస్టర్ ఉంది. దీంతో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతుందని స్పష్టం అవుతుంది. మొదటి సినిమాకే రాకింగ్ రాకేష్ ఇలాంటి టైటిల్ని పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ టైటిల్ లాంచ్ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి తో పాటు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.మామిడి హరికృష్ణతో పాటు చిత్ర బృందం హాజరయ్యారు. ఈ చిత్రంలో రాకింగ్ రాకేష్ సరసన అనన్య హీరోయిన్గా నటిస్తోంది. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న 'వ్యూహం' ట్రైలర్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>