Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icccd47cf58-1535-42f8-962a-17aaa8f0427d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icccd47cf58-1535-42f8-962a-17aaa8f0427d-415x250-IndiaHerald.jpgటీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ఇక తన బ్యాటింగ్ తో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉన్నాడు. సాధారణంగా రోహిత్ శర్మకు భారత క్రికెట్లో డబుల్ సెంచరీలు వీరుడు సిక్సర్ల వీరుడు అని పేరు ఉంది. ఎందుకంటే అతను ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడు అంటే చాలు బ్యాటింగ్లో సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. ఏకంగా ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఉంటాడు. అందుకే అతన్ని అభిమానులు అందరూ కూడా హిట్ మ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే తనకు అభIcc{#}VIRAT KOHLI;Rohit Sharma;Pakistan;Australia;World Cup;Indiaకోహ్లీని దాటేసిన రోహిత్.. అరుదైన రికార్డ్?కోహ్లీని దాటేసిన రోహిత్.. అరుదైన రికార్డ్?Icc{#}VIRAT KOHLI;Rohit Sharma;Pakistan;Australia;World Cup;IndiaSun, 15 Oct 2023 08:30:00 GMTటీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ఇక తన బ్యాటింగ్ తో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉన్నాడు. సాధారణంగా రోహిత్ శర్మకు భారత క్రికెట్లో డబుల్ సెంచరీలు వీరుడు సిక్సర్ల వీరుడు అని పేరు ఉంది. ఎందుకంటే అతను ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడు అంటే చాలు బ్యాటింగ్లో సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. ఏకంగా ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఉంటాడు. అందుకే అతన్ని అభిమానులు అందరూ కూడా హిట్ మ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే తనకు అభిమానులు ఇచ్చిన హిట్ మ్యాన్ అనే పేరుతోను సార్ధకం చేసే విధంగానే ఇప్పుడు అటు వరల్డ్ కప్ లో భాగంగా అతని బ్యాటింగ్ ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి మ్యాచ్ లో పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ గా వెనుతిరిగిన రోహిత్ శర్మ ఆ తర్వాత రెండు మ్యాచ్ లలో  మాత్రం విధ్వంసాన్ని సృష్టించాడు అని చెప్పాలి. ఆఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ తో చలరేగిపోయిన రోహిత్.. ఇటీవల చిరకాల ప్రత్యర్థి అయిన   పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో 86 పరుగులు చేసి అదరగొట్టాడు.


 ఒకానొక సమయంలో రోహిత్ శర్మ సెంచరీ చేయడం ఖాయమని అభిమానులు అందరూ కూడా గట్టిగా నమ్మారు  కానీ 86 పరుగుల వద్ద చివరికి క్యాచ్ ఇచ్చి వికెట్ కోల్పోయాడు. అయితే ఇక పాకిస్తాన్ తో మ్యాచ్లో ప్రదర్శనతో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తన సహచరుడు అయినా విరాట్ కోహ్లీని వెనక్కి నేట్టేసాడు రోహిత్ శర్మ. వరల్డ్ కప్లలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో రోహిత్ రెండవ స్థానంలోకి వచ్చేసాడు. మొదటి స్థానంలో సచిన్ 2278 పరుగులతో ఉండగా కోహ్లీ 1186 పరుగులను అధిగమించి రోహిత్ 1195 పరుగులతో రెండో స్థానానికి చేరుకున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న 'వ్యూహం' ట్రైలర్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>