Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith308e52aa-8195-494e-a794-1f0715917121-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith308e52aa-8195-494e-a794-1f0715917121-415x250-IndiaHerald.jpgటీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో కూడా ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే విధంగా బ్యాటింగ్ విధ్వంసం కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి మ్యాచ్లో రోహిత్ శర్మ తన ప్రదర్శనతో అభిమానులందరినీ కూడా నిరాశపరిచాడు. ఎందుకంటే భారీ అంచనాల మధ్య ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. పరుగుల ఖాతా తెరవకుండానే డక్ అవుట్ గా వెనుతిరిగాడు.. దీంతో రోహిత్ ఈ వరల్డ్ కప్ లో ఎలా రాణిస్తాడో అనే ఆందోళన అంRohith{#}Rohit Sharma;Australia;World Cup;Pakistanఅదిరిపోయే బ్యాటింగ్.. రోహిత్ అరుదైన రికార్డ్?అదిరిపోయే బ్యాటింగ్.. రోహిత్ అరుదైన రికార్డ్?Rohith{#}Rohit Sharma;Australia;World Cup;PakistanSun, 15 Oct 2023 10:45:00 GMTటీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో కూడా ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే విధంగా బ్యాటింగ్ విధ్వంసం కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి మ్యాచ్లో రోహిత్ శర్మ తన ప్రదర్శనతో అభిమానులందరినీ కూడా నిరాశపరిచాడు. ఎందుకంటే భారీ అంచనాల మధ్య ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. పరుగుల ఖాతా తెరవకుండానే డక్ అవుట్ గా వెనుతిరిగాడు..



 దీంతో రోహిత్ ఈ వరల్డ్ కప్ లో ఎలా రాణిస్తాడో అనే ఆందోళన అందరిలో నిండిపోయింది. అయితే ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన రెండో మ్యాచ్లో మాత్రం రోహిత్ తన బ్యాటింగ్ సత్తా ఏంటో చూపించాడు. ఏకంగా సెంచరీ తో చేలరేగిపోయాడు. 63 బంతుల్లోనే సెంచరీ చేశాడు   మొత్తంగా ఈ మ్యాచ్ లో 131 పరుగులు చేసి ఇక జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. దీంతో ఇక రోహిత్ బ్యాటింగ్ చూసి అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. ఇక ఇటీవలే పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లోను రోహిత్ పాక్ బౌలర్లతో చెడుగుడు ఆడేసాడు.


 క్రీజు లోకి వచ్చినప్పటి నుంచి సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయిన రోహిత్ శర్మ ఏకంగా 86 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు రోహిత్ శర్మ. మెగా టోర్నీలో విజయవంతమైన చేదనల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా హిట్ మ్యాన్ నిలిచాడు. తొమ్మిది ఇన్నింగ్స్ లో రోహిత్ 586 పరుగులు చేయగా.. ఆ తర్వాత స్థానంలో రికీ పాంటింగ్ 519, మార్టిన్ గాప్తిల్ 504, గిల్ క్రిస్ట్ 498 పరుగులతో ఉన్నారు. వన్డే వరల్డ్ కప్ లో 5 లేదా అంతకంటే ఎక్కువసార్లు సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ ల జాబితాలో రోహిత్ మూడు సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న 'వ్యూహం' ట్రైలర్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>