Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anil07657100-3ca5-4605-8127-eda6d4159dec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anil07657100-3ca5-4605-8127-eda6d4159dec-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు సంబంధించి ఒక వివాదం నడుస్తోంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు అంటే అనిరుద్ రవిచంద్రన్ తోపాటు తమన్ పేరుని సిని ప్రేక్షకులు అందరూ కూడా చెబుతూ ఉంటారు. స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలకు కూడా మ్యూజిక్ అందిస్తూ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు తమ పాటలతో అందరిని ఉర్రూతలుగిస్తూన్నారు అని చెప్పాలి. అయితే అనిరుద్తో పోల్చి చూస్తే సోషల్ మీడియాలో థమన్ కు కాస్త నెగెటివిటీ ఎక్Anil{#}boyapati srinu;Audience;anil ravipudi;Kesari;thaman s;Darsakudu;Director;Telugu;Cinema;Yevaruబోయపాటి శ్రీను పై.. ఇన్ డైరెక్ట్ గా కౌంటర్లు వేసిన అనిల్ రావిపూడి?బోయపాటి శ్రీను పై.. ఇన్ డైరెక్ట్ గా కౌంటర్లు వేసిన అనిల్ రావిపూడి?Anil{#}boyapati srinu;Audience;anil ravipudi;Kesari;thaman s;Darsakudu;Director;Telugu;Cinema;YevaruSun, 15 Oct 2023 13:00:00 GMTగత కొంతకాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు సంబంధించి ఒక వివాదం నడుస్తోంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు  ఎవరు అంటే అనిరుద్ రవిచంద్రన్ తోపాటు తమన్ పేరుని సిని ప్రేక్షకులు అందరూ కూడా చెబుతూ ఉంటారు. స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలకు కూడా మ్యూజిక్ అందిస్తూ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు తమ పాటలతో అందరిని ఉర్రూతలుగిస్తూన్నారు అని చెప్పాలి. అయితే అనిరుద్తో పోల్చి చూస్తే సోషల్ మీడియాలో థమన్ కు కాస్త నెగెటివిటీ ఎక్కువగా ఉంది.


 థమన్ ఏ కొత్త పాట కంపోస్ చేసిన ఇది ఇంకో పాటకు కాపీ అంటూ నెటిజెన్స్ ట్రోల్ చేయడం చేస్తూ ఉంటారు. అయితే పాటల విషయంలో ఎలా ఉన్నా థమన్ అందించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మాత్రం ప్రేక్షకులు వంక పెట్టడానికి ఏమీ ఉండదు అని చెప్పాలి. ఇప్పటివరకు తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో సాధారణ సన్నివేశాలను సైతం ప్రేక్షకుల ఫేవరెట్ గా నిలిచిపోయే సన్నివేశాలుగా మార్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.  అలాంటి థమన్ మ్యూజిక్ ని ఇటు  దర్శకుడు బోయపాటి శ్రీను కూరలో కరివేపాకుల తీసి పారేశాడు.


 థమన్ మ్యూజిక్ అందించిన అఖండ సినిమా మ్యూజిక్ లేకపోయినా కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుందని.. అది ఆ సినిమాకు ఉన్న లెవెల్ అంటూ బోయపాటి శ్రీను వ్యాఖ్యానించాడు. ఇలా తమన్ మ్యూజిక్ లో పెద్దగా గొప్పతనం ఏమీ లేదు అంటూ బోయపాటి వ్యాఖ్యానించాడు. అయితే ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంతు కేసరి సినిమాకు గాను థమన్ అందించిన మ్యూజిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ ప్రాణం పోసింది. చాలా సన్నివేశాలు ఆయన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కారణంగా అనుకున్న దానికంటే అద్భుతంగా వచ్చినట్లు అనిపించింది. రేపు సినిమా చూసాక కూడా మీరు ఇదే చెబుతారు. నాకు తెలిసి తమ ఇప్పటివరకు థమన్ బెస్ట్ ఇచ్చాడు అంటూ అనిల్ రావిపూడి కామెంట్ చేసాడు. దీంతో బోయపాటి వ్యాఖ్యలకు అనిల్ రావిపూడి  కౌంటర్ వేశాడు అని అందరూ చర్చించుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రవితేజను కించపరిచేలా.. తాప్సి షాకింగ్ కామెంట్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>