MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-abimanulaku-pedha-shock-eachina-reanu-deasi7b50b242-c5f7-4e4d-8588-68de8384c573-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-abimanulaku-pedha-shock-eachina-reanu-deasi7b50b242-c5f7-4e4d-8588-68de8384c573-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా హీరో అవ్వాలని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్న విషయం తెలిసిందే. కానీ అకీరాకి మాత్రం నటన పైన ఇంట్రెస్ట్ లేదని హీరో అవ్వడని ఇప్పటికే రేణు దేశాయ్ క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఇక రేణు దేశాయ్ కూడా సినిమాలకి దూరమైనా.. సోషల్ మీడియా ద్వారా యాక్టివ్గా అందరికీ అందుబాటులో ఉంటూ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఈ సినిమాలో ఆమె హేమలత లవణం అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సినRENU DESAI;COMMENTES{#}renu desai;Akira Nandhan;Akkineni Nageswara Rao;ravi teja;kalyan;Director;media;Hero;Cinema;Raviపవన్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చిన రేణూ దేశాయ్..!పవన్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చిన రేణూ దేశాయ్..!RENU DESAI;COMMENTES{#}renu desai;Akira Nandhan;Akkineni Nageswara Rao;ravi teja;kalyan;Director;media;Hero;Cinema;RaviFri, 13 Oct 2023 14:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా హీరో అవ్వాలని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్న విషయం తెలిసిందే. కానీ అకీరాకి మాత్రం నటన పైన ఇంట్రెస్ట్ లేదని హీరో అవ్వడని ఇప్పటికే రేణు దేశాయ్ క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఇక రేణు దేశాయ్ కూడా సినిమాలకి దూరమైనా.. సోషల్ మీడియా ద్వారా యాక్టివ్గా అందరికీ అందుబాటులో ఉంటూ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇక ఈ సినిమాలో ఆమె హేమలత లవణం అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సినిమా విడుదలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన రేణూ దేశాయ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే అకీరా నందన్ అలా కావాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం అకీరా అమెరికాలోని ఒక ఫిలిమ్ స్కూల్లో మ్యూజిక్ తో పాటు మరికొన్ని కోర్సులు నేర్చుకుంటున్నాడు.

తాజాగా ఈ ప్రమోషన్స్ లో మరొకసారి అకీరా హీరో అవ్వడు.. అతడికి యాక్టింగ్ నచ్చదు అంటూ మరొకసారి క్లారిటీ ఇచ్చింది.అయితే అకీరానీ తల్లిగా మీరు ఎలా చూడాలనుకుంటున్నారు అని అడగగా ఒక పెద్ద స్టేడియంలో కొన్ని వందల మంది ముందు పియానో వాయిస్తుంటే చూడాలని ఉంది. అలాగే ఏ తల్లి అయినా కూడా తన కొడుకుని స్క్రీన్ మీద చూడాలనుకుంటుంది కానీ అకీరా ఏం అవ్వాలనుకుంటున్నాడో అదే నా ఇష్టం.అకీరా యాక్టర్ అవ్వాలని ఉందని చెప్పినా ఓకే చెప్తాను అంటూ ఆమె తెలిపింది.


ఇకపోతే అకీరా పియానో చాలా అద్భుతంగా వాయిస్తాడని అందరికీ తెలిసిందే. గతంలో కూడా పలుసార్లు అకిరా పియానో వాయించిన వీడియోలను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పటికే ఒక షార్ట్ ఫిలిం కి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన అకీరా భవిష్యత్తులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లియో అప్డేట్స్: ఆ దేశంలో రికార్డ్.. ఫ్యాన్స్ కి పండగే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>