EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababuabe40ed8-9ea2-4996-83a3-252b96426cd4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababuabe40ed8-9ea2-4996-83a3-252b96426cd4-415x250-IndiaHerald.jpgస్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం విషయంలో మాజీ ముఖ్య మంత్రి తెలుగుదేశం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో 17 ఏ పరంగా గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబును విచారించడం కరెక్ట్ కాదని ఆయన తరపు లాయర్ హరీష్ సాల్వే మొన్న రెండు గంటలు, నిన్న ఒక గంట వాదించారని తెలుస్తుంది. అయితే ఈసారి బాబు గారు విషయంలో వెలువడే తీర్పు ఒక బెంచ్ మార్క్ తీర్పు అని అంటున్నారు. ఒక తీర్పును అనేక మార్లు ఉటంకిస్తూ ఉంటే దానిని బెంచ్ మార్క్ తీర్పు అని అంటారు. 17 ఏ అనేది అమాయకులైన వారిని అన్యాయంగాCHANDRABABU{#}Supreme Court;Governor;High court;court;CBN;Telangana Chief Minister;CMచంద్రబాబు కేసు.. చరిత్రలో నిలిచిపోతుందా?చంద్రబాబు కేసు.. చరిత్రలో నిలిచిపోతుందా?CHANDRABABU{#}Supreme Court;Governor;High court;court;CBN;Telangana Chief Minister;CMFri, 13 Oct 2023 09:14:00 GMTస్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం విషయంలో మాజీ ముఖ్య మంత్రి తెలుగుదేశం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో 17 ఏ పరంగా గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబును విచారించడం కరెక్ట్ కాదని ఆయన తరపు లాయర్ హరీష్ సాల్వే మొన్న రెండు గంటలు, నిన్న ఒక గంట వాదించారని తెలుస్తుంది. అయితే ఈసారి బాబు గారు విషయంలో వెలువడే తీర్పు ఒక బెంచ్ మార్క్ తీర్పు అని అంటున్నారు.


ఒక తీర్పును అనేక మార్లు ఉటంకిస్తూ ఉంటే దానిని బెంచ్ మార్క్ తీర్పు అని అంటారు. 17 ఏ అనేది అమాయకులైన వారిని అన్యాయంగా అరెస్టు చేయకూడదు అనే ప్రాతిపదికన‌ ఏర్పడిందని అంటున్నారు. అలాంటిది అవినీతి కేసులో నిందితుడిగా ఉన్న వాళ్ళని విడిపించడానికి కూడా ఈ కేసును వాడతారా అనేదే ఇక్కడ పాయింట్ అవుతుంది ఇప్పుడు. ఈ చట్టం 2018 లో సవరించబడిందని తెలుస్తుంది.


17 ఏ చట్టం అనేది కొత్త ప్యాకేజీలో భాగం అని, 2018 కి ముందు జరిగిన  నేరాలకు 17 ఏ వర్తించదని వాళ్లు వాదిస్తున్నారు. పాత నేరాలకు పాత చట్టాలు వర్తిస్తాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. నేరం 2015-16 లో జరిగింది కాబట్టి చంద్రబాబుకి 17 ఏ వర్తించదనే రోహత్గీ వాదన ఇక్కడ కీలకంగా మారింది. రోహత్గీ వ్యాఖ్యలను లూద్ర ఎదుర్కోవడానికి ప్రయత్నించారు.


అయితే కోర్టు ఆయనను వారించింది. ఈ సందర్భంగా 17 ఏ ఫై సుప్రీం కోర్టుకు చెందిన ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. 17 ఏ పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం  అభిప్రాయపడింది. దీనిపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను పట్టించుకుంటే సరిపోతుందని ధర్మాసనం ఈ సందర్భంగా  తెలియజేసింది. అసలు  చంద్రబాబు నాయుడు అరెస్టు కేసులో రాజకీయ కక్ష సాధింపు అనేదే  లేదని రోహత్గీ వాదించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హాట్ లుక్ ఉన్న డ్రెస్లో క్యూట్ స్మైల్ తో కవ్విస్తున్న ఈశా రేబ్బా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>