LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/improve-childrens69c40bbf-14df-4d5c-92e5-ad805e00ef47-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/improve-childrens69c40bbf-14df-4d5c-92e5-ad805e00ef47-415x250-IndiaHerald.jpgసాధారణంగా ప్రతి పిల్లలకు ఒకే రకమైన మెదడు,ఒకే రకమైన జ్ఞాపకశక్తి ఉంటుంది.కానీ మనం తినే ఆహారం, మనం జీవించే విధానం వల్ల మెదడు ప్రభావితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇప్పుడున్న జనరేషన్ తల్లి దండ్రులు పిల్లల్ని ఎక్కువ గారాబం చేస్తూ,వారు ఏమడిగినా లేదు అనకుండా కొనిస్తున్నారు. ఇంకా తిండి తినే విషయంలో కొదవే లేదు.వారు అడిగిన జంక్ పుడ్ ఆర్డర్ లు వెంటనే గుమ్మం ముందూ ఉంటాయి.ఇలా చేయడంతో వారి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా వారి జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది.దానితో మిగతా పిల్లలకంటే వెనుకబడిపోతారు.అలా కాకుండా ఉండాIMPROVE;CHILDRENS{#}Iron;Cow slaughter;Manam;Shaktiమీ పిల్లలు తెలివిగా ఉండాలంటే తప్పక ఇవ్వాల్సిన ఆహారాలివే..?మీ పిల్లలు తెలివిగా ఉండాలంటే తప్పక ఇవ్వాల్సిన ఆహారాలివే..?IMPROVE;CHILDRENS{#}Iron;Cow slaughter;Manam;ShaktiFri, 13 Oct 2023 19:00:00 GMTసాధారణంగా ప్రతి పిల్లలకు ఒకే రకమైన మెదడు,ఒకే రకమైన జ్ఞాపకశక్తి ఉంటుంది.కానీ మనం తినే ఆహారం, మనం జీవించే విధానం వల్ల మెదడు ప్రభావితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇప్పుడున్న జనరేషన్ తల్లి దండ్రులు పిల్లల్ని ఎక్కువ గారాబం చేస్తూ,వారు ఏమడిగినా లేదు అనకుండా కొనిస్తున్నారు. ఇంకా తిండి తినే విషయంలో కొదవే లేదు.వారు అడిగిన జంక్ పుడ్ ఆర్డర్ లు వెంటనే గుమ్మం ముందూ ఉంటాయి.ఇలా చేయడంతో వారి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా వారి జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది.దానితో మిగతా పిల్లలకంటే వెనుకబడిపోతారు.అలా కాకుండా ఉండాలంటే అధిక పోషకాలు కలిగిన ఆహారాలు తప్పకుండా ఇవ్వాలి. అలాంటి ఆహారలెంటో మనము చూద్దాం పడండి..

మెదడు పెరుగుదల కోసం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లను అధికంగా ఇవ్వాలి.APA, ALA, & DHA, మెగ్నీషియంతో,విటమిన్ B కాంప్లెక్స్ వంటి న్యూట్రియాంట్స్ పిల్లల అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.చేప నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.అంతే కాక జింక్ కలిగిన ఆహారాలు కూడా మెదడు పెరుగుదలకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా వేయించిన వేరు శనగలు,వాల్‌నట్‌లు, నానబెట్టిన బాదం,చియా గింజలు,అవిసె గింజలు , ఆవు నెయ్యిలో వంటి ఆహారాలను పిల్లలకి అందించడంతో వారికి తగినంత పోషకాలు లభించి,వారి పెరుగుదల అన్ని విధాలా సక్రమంగా ఉంటుంది.

వీటితో పాటు ఐరన్ కలిగిన ఆకుకూరలు కూరగాయలను తరచూ సలాడ్ రూపంలో ఇవ్వడంతో కొత్త రక్త కణాలు వృద్ధి చెంది,మెదడుకు సరైన రక్త ప్రసరణ పెరుగుతుంది.దీనితో కూడా వారు చురుగ్గా మెరుగ్గా ఉంటారు.క్యాల్షియం అధికంగా ఉన్న గుడ్లు, పాలు,ఆకుకూరలు ఎక్కువగా ఇవ్వడంతో వారి బోన్స్ట్రెంత్ పెరిగి,సరైన ఎదుగుదలను కనబరుస్తారు. కావున మీ పిల్లల కూడా ఇతర పిల్లలతో  కంపేర్ చేసినప్పుడు భిన్నంగా ఉండాలి అంటే పైన చెప్పిన ఆహారాలను తప్పక ఇవ్వాలి.అంతే కాక వీటితోపాటు మెదడు పెరుగుదలకు నీరు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.శరీరం డిహైడ్రేషన్ గురి కాకుండా నీటిని కూడా ఎక్కువగా తప్పకుండా తాగించాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ టైట్ ఫిట్ లో ఈషా రెబ్బా అందాల విందు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>