Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby4933a3bd-ff02-427c-8f04-c1a6aa4f24fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby4933a3bd-ff02-427c-8f04-c1a6aa4f24fb-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ సృష్టించిన మూవీ ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా బేబీ మూవీ అని చెప్పేస్తుంటారు. ఎందుకంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది ఆనంద్ దేవరకొండ హీరోగా.. యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విరాజ్ అశ్విన్ మరో కీలక పాత్రలో నటించాడు అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక పది సినిమాలకు రBaby{#}Love Story;Anand Deverakonda;Chaitanya;Darsakudu;Director;Hero;Audience;Cinemaబేబీ కాంబో మరోసారి రిపీట్.. సినిమా టైటిల్ ఏంటంటే?బేబీ కాంబో మరోసారి రిపీట్.. సినిమా టైటిల్ ఏంటంటే?Baby{#}Love Story;Anand Deverakonda;Chaitanya;Darsakudu;Director;Hero;Audience;CinemaThu, 12 Oct 2023 14:30:00 GMTఇటీవల కాలంలో ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ సృష్టించిన మూవీ ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా బేబీ మూవీ అని చెప్పేస్తుంటారు. ఎందుకంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది ఆనంద్ దేవరకొండ హీరోగా.. యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విరాజ్ అశ్విన్ మరో కీలక పాత్రలో నటించాడు అని చెప్పాలి.



 ఒక రకంగా చెప్పాలి అంటే ఒక పది సినిమాలకు రావాల్సినంత గుర్తింపు బేబీ సినిమాతోనే అటు ఆనంద్ దేవరకొండ కి ఇటు వైష్ణవి చైతన్యకు కూడా వచ్చేసింది అని చెప్పాలి. అంతేకాదు ఇక ఇద్దరి కాంబినేషన్ కూడా క్రేజీ కాంబినేషన్ గా ప్రేక్షకులలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈ సినిమా తర్వాత వైష్ణవి చైతన్యకు వరుసగా ఆఫర్లు తలుపు తడుతూ ఉన్నాయి. ఇకపోతే ఇప్పుడు వైష్ణవి చైతన్య, ఆనంద దేవరకొండకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరోసారి బేబీ కాంబో రిపీట్ కాబోతుందట. ఇక ఈ మూవీ కూడా యూత్ ఫుల్ లవ్ స్టోరీ గానే తెరకెక్కబోతుంది అని ఒక వార్త ఇండస్ట్రీలో తెగ చకర్లు కొడుతుంది.



 ఈ సినిమాకు డ్యూయెట్ అనే ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారట. అయితే బేబీ సినిమాలో కొన్ని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది వైష్ణవి చైతన్య. కానీ ఇప్పుడు డ్యూయెట్ సినిమాలో మాత్రం ఆమె పాత్ర పాజిటివ్ కోణంలోనే ఉండబోతుందట. అయితే బేబీ సినిమాను సాయి రాజేష్ అనే కొత్త దర్శకుడు దగ్గరికి ఎక్కించినట్లుగానే ఇప్పుడు డ్యూయెట్ అనే సినిమాను కూడా కొత్త దర్శకుడు మిథున్ తెరకెక్కించబోతున్నాడట. అయితే చాలామంది హీరో హీరోయిన్లను ఆడిషన్ చేసిన తర్వాత ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్యలను మేకర్స్ ఫైనల్ చేశారు అన్నది తెలుస్తుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

‘చై' ని చెరిపేసి సమంత.. అక్కడ ఆ టాటూ మిస్సింగ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>