TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-arjun-ambati8144eb63-9c71-451c-9dd4-45c592849a9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-arjun-ambati8144eb63-9c71-451c-9dd4-45c592849a9d-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఆరు సీజన్లను పూర్తి చేసుకోగా.. ఇప్పుడు ఏడవ సీజన్ కూడా మొదలైంది. అప్పుడే 5 వారాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా పెద్దగా ఈ షో ఆదరణ పొందలేదు. గతంలో కంటే కొత్తగా అంటూ ఇంకా చెత్తగా అనే కామెంట్లను కూడా జనాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు అందరూ అమ్మాయిలని ఎలిమినేట్ చేసి హౌస్ ని కాస్త బాయ్స్ హాస్టల్ గా మార్చేశారు అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ విషయాన్ని నాBIGBOSS;ARJUN AMBATI{#}Jr NTR;Akkineni Nagarjuna;Bigboss;Arjun;House;television;NewsTV: బిగ్ బాస్ నుంచీ అర్జున్ అంబటి ఎంత పారితోషకం తీసుకుంటున్నారో తెలుసా..?TV: బిగ్ బాస్ నుంచీ అర్జున్ అంబటి ఎంత పారితోషకం తీసుకుంటున్నారో తెలుసా..?BIGBOSS;ARJUN AMBATI{#}Jr NTR;Akkineni Nagarjuna;Bigboss;Arjun;House;television;NewsThu, 12 Oct 2023 02:00:00 GMTతెలుగు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఆరు సీజన్లను పూర్తి చేసుకోగా.. ఇప్పుడు ఏడవ సీజన్ కూడా మొదలైంది. అప్పుడే 5 వారాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా పెద్దగా ఈ షో ఆదరణ పొందలేదు. గతంలో కంటే కొత్తగా అంటూ ఇంకా చెత్తగా అనే కామెంట్లను కూడా జనాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు అందరూ అమ్మాయిలని ఎలిమినేట్ చేసి హౌస్ ని కాస్త బాయ్స్ హాస్టల్ గా మార్చేశారు అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ విషయాన్ని నాగార్జున కూడా తెలిపారు.

అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్7  2.0 సరికొత్తగా మొదలు కాగా ఈసారి ఐదు మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. ఇక వారిలో మొదటి కంటెస్టెంట్ గా అర్జున్ అంబటి హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇకపోతే అర్జున్ అంబటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన పలు టీవీ సీరియల్స్,  షోల ద్వారా జనాలకు బాగా పరిచయం అయ్యాడు. బుల్లితెరపై ఉన్న క్రేజ్ తోనే ఆయన బిగ్బాస్లోకి అడుగుపెట్టడం జరిగింది. ముఖ్యంగా అర్జున్కి ఫాలోయింగ్ చాలా ఎక్కువ.. ఆ కట్ అవుట్.. ఫిజిక్ అందరూ జూనియర్ ప్రభాస్ అంటూ ముద్దుగా ఆయనను పిలుచుకుంటూ ఉంటారు.

 ఇకపోతే ఇప్పటివరకు హౌస్ లో ఉన్న వారందరి కంటే అర్జున్ అంబటి ఎక్కువగా పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కో రోజుకి వాళ్ళ క్రేజ్  ను బట్టి రూ.20 వేల వరకు పారితోషకం తీసుకుంటూ ఉంటుంటే.. అర్జున్ మాత్రం ఎక్కువగానే తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయన ఒక రోజుకి రూ.35 వేలకు పైగా పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం .మరి అర్జున్ తన ఆట తీరుతో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : ఓవర్ యాక్షన్ మామూలుగా లేదుగా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>