MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7fab5050-34d2-4365-bdda-5ee22e857483-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7fab5050-34d2-4365-bdda-5ee22e857483-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి. ఇందులొ కాజల్, శ్రీలీల ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. దసరా కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రిలీజ్ టైం దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే సినిమాపై బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచేస్తుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ ని అందుకుంది. ఇక తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ అగర్వాల్ ఓtollywood{#}kajal aggarwal;Balakrishna;Heroine;Audience;Dussehra;Vijayadashami;Cinema;Interview;Loveశ్రీలీల కి ఉన్నంత క్లారిటీ నాకు లేదు కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!శ్రీలీల కి ఉన్నంత క్లారిటీ నాకు లేదు కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!tollywood{#}kajal aggarwal;Balakrishna;Heroine;Audience;Dussehra;Vijayadashami;Cinema;Interview;LoveThu, 12 Oct 2023 19:50:00 GMTబాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి. ఇందులొ కాజల్, శ్రీలీల ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. దసరా కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రిలీజ్ టైం దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే సినిమాపై బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచేస్తుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ ని అందుకుంది. ఇక తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో కాజల్ 'కాత్యాయని' అనే పాత్రలో కనిపించనుంది. 

ఈ మేరకు ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ సినిమాకు సంబంధించి అనేక విషయాలను అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా తన తోటి హీరోయిన్ శ్రీ లీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు వచ్చే జనరేషన్ హీరోయిన్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఓ హీరోయిన్ కి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటి? అని యాంకర్ అడగగా దానికి కాజల్ బదులిస్తూ.." సినిమాలతో పాటూ పర్సనల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. జీవితంలో సినిమాలతో పాటు ఇంకా చాలా చేయాలి. నేను కూడా సినిమాని బాగా ప్రేమిస్తాను. నా మొదటి లవ్ కూడా అదే. కానీ నా పర్సనల్ లైఫ్ లో సినిమాలతో పాటు ఇంకా చాలా పనులు చేస్తున్నా.

ఇవన్నీ చూసుకొని సినిమాలు చేసి రెండిటిని బ్యాలెన్స్ చేయడం అంటే అది చాలా కష్టం. కానీ నువ్వు నిజంగా చేయాలని అనుకుని అన్నిటినీ ఛాలెంజింగ్ గా తీసుకుంటే అది జరుగుతుంది. ఆ క్వాలిటీస్ ని నేను శ్రీలలలో చూశాను. శ్రీలీలకి చాలా పొటెన్షియల్ ఉంది. తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. విధేయం గా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా చాలా ఫోకస్ గా ఉంటుంది. తనకేం కావాలో తనకు బాగా తెలుసు.శ్రీలీలతో పాటు ఈ జనరేషన్ హీరోయిన్స్ సినిమాల విషయంలో చాలా ఫోకస్ గా ఉన్నారు. అది నాకు బాగా నచ్చింది. వాళ్ళకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ ప్లానింగ్ ఉంది. వాటితోనే వాళ్లంతా ముందుకు వెళ్లడం నిజంగా అద్భుతం" అంటూ కాజల్ అగర్వాల్ తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కుర్ర హీరో సినిమాలో హనీ రోజ్ స్పెషల్ సాంగ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>