MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc6805b8c-02b2-43e7-be46-25d1ab49f7a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc6805b8c-02b2-43e7-be46-25d1ab49f7a2-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్ చెన్నై బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొన్నాయి. ఫ్యాన్స్ అయితే లియో కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇటీవల ట్రైలర్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. tollywood{#}Lokesh;Ram Charan Teja;Trisha Krishnan;Director;Chennai;Prize;Joseph Vijay;Lokesh Kanagaraj;Darsakudu;Event;Telugu;kushi;Kushi;Tollywood;Chitram;Hero;Cinema;Newsహైదరాబాద్ లో 'లియో'ప్రీ రిలీజ్ ఈవెంట్..!!హైదరాబాద్ లో 'లియో'ప్రీ రిలీజ్ ఈవెంట్..!!tollywood{#}Lokesh;Ram Charan Teja;Trisha Krishnan;Director;Chennai;Prize;Joseph Vijay;Lokesh Kanagaraj;Darsakudu;Event;Telugu;kushi;Kushi;Tollywood;Chitram;Hero;Cinema;NewsThu, 12 Oct 2023 19:40:00 GMTహీరో దళపతి విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్  చెన్నై బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొన్నాయి. ఫ్యాన్స్ అయితే లియో కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇటీవల ట్రైలర్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరోవైపు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పటికే కోలీవుడ్లో ఈ మూవీ ప్రమోషన్స్ ని మొదలుపెట్టి వరుస ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 

ఆ ఇంటర్వ్యూల్లో సినిమా గురించి కొత్త కొత్త విషయాలు తెలుపుతూ సినిమాపై అంచనాలను తారస్థాయికి తీసుకెళ్తున్నాడు. ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో 'లియో' మూవీలో రామ్ చరణ్ సర్ ప్రైజ్ ఎంట్రీ ఉండబోతుందని, కమల్ హాసన్ కూడా లియో మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నారని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. వీటిపై లోకేష్ కనగరాజ్ ప్రత్యక్షంగా నోరు విప్పకపోయినా పరోక్షంగా ఈ సినిమాలో ఎవ్వరు ఊహించని విధంగా సర్ ప్రైజ్ లు ఉంటాయని చెప్పడం ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ విషయం కాస్త పక్కన పెడితే.. లియో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన సాలిడ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. 'లియో' మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో గ్రాండ్ గా

 నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ఈవెంట్ కి తలపతి విజయ్ రావట్లేదని, చీఫ్ గెస్ట్ లుగా దర్శకుడు లోకేష్ కనగరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ లతో పాటు చిత్ర బృందం పాల్గొనబోతుందని టాక్ వినిపిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో అనిరుద్ లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఉండబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వచ్చేవారం హైదరాబాదులో 'లియో' తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ ఉండబోతుందని అంటున్నారు. ఈ న్యూస్ తో టాలీవుడ్ విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కుర్ర హీరో సినిమాలో హనీ రోజ్ స్పెషల్ సాంగ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>