MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgమాస్ మహారాజ రవితేజా చాలామంది టాప్ హీరోల మాదిరి మీడియాతో సన్నిహితంగా ఉండడు. మీడియా వర్గాలకు పార్టీలు ఇవ్వడం అలాగే తన అభిమాన సంఘాల నాయకులతో కలుస్తూ ఉండటం రవితేజ వ్యవహార శైలికి పడదు అని అంటారు. అంతేకాదు సోషల్ కూడ రవితేజ యాక్టివ్ గా ఉండడు. దీనికి సంబంధించిన స్పష్టమైన కారణాలు ఎవరికీ తెలియవు.ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ దసరా ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతోంది. ఈ సంవత్సరం దసరా కు ఎన్నో భారీ సినిమాలు పోటీ పడుతున్న పరిస్థితులలో ప్రతిహీరో తమ సినిమాల ప్రమోషన్ ను చాల ప్లాన్డ్ గా చేస్తRAVITEJA{#}Ravi;Balakrishna;ravi teja;Dussehra;Mumbai;India;bollywood;Cinema;Telugu;media;Vijayadashami;Mass;Athaduతె లుగు మీడియాకు దూరం అవుతున్న రవితేజా !తె లుగు మీడియాకు దూరం అవుతున్న రవితేజా !RAVITEJA{#}Ravi;Balakrishna;ravi teja;Dussehra;Mumbai;India;bollywood;Cinema;Telugu;media;Vijayadashami;Mass;AthaduThu, 12 Oct 2023 15:00:19 GMTమాస్ మహారాజ రవితేజా చాలామంది టాప్ హీరోల మాదిరి మీడియాతో సన్నిహితంగా ఉండడు. మీడియా వర్గాలకు పార్టీలు ఇవ్వడం అలాగే తన అభిమాన సంఘాల నాయకులతో కలుస్తూ ఉండటం రవితేజ వ్యవహార శైలికి పడదు అని అంటారు. అంతేకాదు సోషల్ కూడ రవితేజ యాక్టివ్ గా ఉండడు. దీనికి సంబంధించిన స్పష్టమైన కారణాలు ఎవరికీ తెలియవు.


ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ దసరా ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతోంది. ఈ సంవత్సరం దసరా కు ఎన్నో భారీ సినిమాలు పోటీ పడుతున్న పరిస్థితులలో ప్రతిహీరో తమ సినిమాల ప్రమోషన్ ను చాల ప్లాన్డ్ గా  చేస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రింట్ మీడియా సంస్థలకు బాలకృష్ణ విజయ్ తమ సినిమాలకు సంబంధించిన ఇంటర్ వ్యూలు ఇస్తూ బిజీగా కాలం గడుపుతూ ఉంటే రవితేజా మాత్రం తెలుగు మీడియా ప్రతినిధులకు అందుబాటులో లేకుండా ముంబాయిలోని మీడియా సంస్థలకు తన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరావు గురించి అనేక వివరాలు చెపుతూ ముంబాయిలో బిజీగా ఉన్నట్లు గాసిప్పులు వస్తున్నాయి.


దీనితో మాస్ మహారాజా తెలుగు మీడియాను ఎందుకు పక్కకు పెట్టాడు అంటూ కొందరు ఆశ్చర్య పోతున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ పాన్ ఇండియాగా విడుదల చేస్తున్నప్పటికీ రవితేజా గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం అవగాహన లేని పరిస్థితులలో మాస్ మహారాజా ముంబాయ్ మీడియాకు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ‘టైగర్ నాగేశ్వరావు’ పై క్రేజ్ ఏర్పడుతుందా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నట్లు టాక్.


అయితే మాస్ మాహారాజా రవితేజా మాత్రం తన ‘టైగర్ నాగేశ్వరావు’ ఎంత పోటీ ఉన్నప్పటికీ దసరా రేస్ లో విజేతగా నిలిచి తీరుతుంది అన్న స్థిర అభిప్రాయంలో ఉండటంతో తెలుగు మీడియాను పక్కకు పెట్టి తనకు ఏమాత్రం పరిచయం లేని ముంబాయి మీడియా ప్రాపకం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

‘చై' ని చెరిపేసి సమంత.. అక్కడ ఆ టాటూ మిస్సింగ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>