DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/congress6a903ce6-c72b-42ea-9a1e-292933a881c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/congress6a903ce6-c72b-42ea-9a1e-292933a881c6-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ముఖ్యంగా ఓటరు నాడి పట్టుకోవడం ఏ సర్వే సంస్థకు అంతుచిక్కదు. రాత్రికి రాత్రే వాళ్ల ఆలోచనా విధానాలు మారిపోతుంటాయి. తెలంగాణలో ఇప్పటి వరకు భారత రాష్ట్ర సమితికి తిరుగులేదు. రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీల ఆరాటం అని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడం ఆపార్టీని కలవరపాటుకు గురి చేస్తోంది. ఒకానొక దశలో భారాస కు తామే ప్రత్యామ్నాయమని.. ఈ సారి అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ఆ పార్టీ నేతCONGRESS{#}KCR;KTR;bhavana;srinivas;Survey;Congress;Partyఅనూహ్యంగా పుంజుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్‌?అనూహ్యంగా పుంజుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్‌?CONGRESS{#}KCR;KTR;bhavana;srinivas;Survey;Congress;PartyThu, 12 Oct 2023 07:00:00 GMTరాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం.  ముఖ్యంగా ఓటరు నాడి పట్టుకోవడం ఏ సర్వే సంస్థకు అంతుచిక్కదు. రాత్రికి రాత్రే వాళ్ల ఆలోచనా విధానాలు మారిపోతుంటాయి. తెలంగాణలో ఇప్పటి వరకు భారత రాష్ట్ర సమితికి తిరుగులేదు. రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీల ఆరాటం అని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడం  ఆపార్టీని కలవరపాటుకు గురి చేస్తోంది.  


ఒకానొక దశలో భారాస కు తామే ప్రత్యామ్నాయమని.. ఈ సారి అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ఆ పార్టీ నేతలు విస్త్రృతంగా ప్రచారం చేశారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్ఎంసీలో ఆశాజనక స్థానాలు రావడం ఆ పార్టీలో నూతనుత్తేజం నింపింది. కానీ ఈ తర్వాత జరిగిన మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఆ పార్టీ ఢీలా పడిపోయింది. బండి సంజయ్ పదవి నుంచి తొలగించడం, పార్టీలో చేరికలు సరిగా లేకపోవడం, నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీ గ్రాఫ్ నానాటికీ తీసికట్టుగా తయారైంది.


దీంతో ఈ స్థానాన్ని కాంగ్రెస్ తిరిగి చేజిక్కించుకుంది. అంతర్గత కలహాలతో జరిగిన ప్రతి ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ రేవంత్ నాయకత్వంలో సరికొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తోంది.  దీంతో పాటు ఏఐసీసీ పెద్దలు కూడా తెలంగాణపై దృష్టి సారించడంతో పార్టీ పరిస్థితులు కొంత మేర మెరుగయ్యాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత కష్టపడితే తమదే విజయం అనే భావన నాయకుల్లో కలిగింది.  దీంతో సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు.


ఓ పక్క బీఆర్ఎస్ 115 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ తరుణంలో టికెట్ రాని ఆశావహులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లకు చెందిన ముఖ్య నాయకులు ఎల్లే లక్ష్మి నారాయణ, వైద్య శివప్రసాద్, ప్రసాద్, శ్రీనివాస్ లాంటి వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరడంతో తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వానేనా అనే పోటీ నెలకొంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో సైడ్ వ్యూలో అలరిస్తున్న సంయుక్త మీనన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>