PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-naidu-family-lost-hopes-on-judiciaryde552db3-7bf4-49f1-9e82-c1cf842398ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-naidu-family-lost-hopes-on-judiciaryde552db3-7bf4-49f1-9e82-c1cf842398ef-415x250-IndiaHerald.jpgఅందుకనే చివరకు భారమంతా దేవుడిపైనే వేసేసినట్లున్నారు. అధికారిక ట్విట్టర్ ఐ టీడీపీలో ‘చివరకు ధర్మమే గెలుస్తుంది’ అనే నినాదం రాశారు. ‘ఎట్టాగయ్యా శివశివ’ అనే 35 సెకండ్ల సినిమా పాటను వినిపిస్తున్నారు. అందులో భువనేశ్వరి, చంద్రబాబునాయుడు, లోకేష్ ఫొటోలను జతచేశారు. భువనేశ్వరి దీపం పట్టుకుని ఉన్న ఫొటో కనబడుతోంది. బహుశా కాంతితో క్రాంతి అన్న నిరసన సందర్భంగా తీసిన ఫొటో అయ్యుండచ్చు. bhuvaneswari tdp chandrababu{#}bhuvaneshwari;kranthi;kranti;Nara Bhuvaneshwari;twitter;abhishek;CBN;court;Lokesh;Lokesh Kanagaraj;Cinemaఅమరావతి : ఆశలు వదిలేసుకున్నారా ?అమరావతి : ఆశలు వదిలేసుకున్నారా ?bhuvaneswari tdp chandrababu{#}bhuvaneshwari;kranthi;kranti;Nara Bhuvaneshwari;twitter;abhishek;CBN;court;Lokesh;Lokesh Kanagaraj;CinemaThu, 12 Oct 2023 07:00:00 GMT


క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలపై చంద్రబాబునాయుడు కుటుంబం ఆశలు వదిలేసుకున్నదా ? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఏ కోర్టులో పిటీషన్లు వేసినా ఎక్కడా ఊరట దక్కటంలేదు. బెయిల్ పిటీషన్ వేస్తే కొట్టేస్తున్నారు. ముందస్తుబెయిల్ పిటీషన్లు వేస్తే కొట్టేశారు. క్వాష్ పిటీషన్ వేసినా ఆశించిన ఫలితం వస్తుందనే నమ్మకం తగ్గిపోతోంది. పైగా విచారణ శుక్రవారానికి వాయిదాపడింది. ఎంతమంది లాయర్లను దించినా, ఎంత ఖరీదైన లాయర్లు వాదించినా ఎలాంటి సానుకూల ఫలితం కనబడటంలేదు.





అందుకనే చివరకు భారమంతా దేవుడిపైనే వేసేసినట్లున్నారు. అధికారిక ట్విట్టర్ ఐ టీడీపీలో ‘చివరకు ధర్మమే గెలుస్తుంది’ అనే నినాదం రాశారు. ‘ఎట్టాగయ్యా శివశివ’ అనే 35 సెకండ్ల సినిమా పాటను వినిపిస్తున్నారు. అందులో భువనేశ్వరి, చంద్రబాబునాయుడు, లోకేష్ ఫొటోలను జతచేశారు. భువనేశ్వరి దీపం పట్టుకుని ఉన్న ఫొటో కనబడుతోంది. బహుశా కాంతితో క్రాంతి అన్న నిరసన సందర్భంగా తీసిన ఫొటో అయ్యుండచ్చు.





ఇక చంద్రబాబు అరెస్టు సందర్భంగా జైలులోకి వెళుతున్న బ్యాక్ ఫొజు ఫొటో పెట్టారు. చేతిలో ఏవో పేపర్లు చూపిస్తున్నారు. ఇందులోనే లోకేష్ ఫొటో కూడా ఉంది. నంద్యాలలో చంద్రబాబు అరెస్టు జరిగినపుడు లోకేష్ రాజోలులో ఉన్నారు. అరెస్టుకు నిరసనగా వెంటనే రాజోలులో రోడ్డుపైనే భైఠాయించారు. ఈ ముగ్గురి ఫోటోలను ట్విట్టర్లో జతచేసి తమకు దారిచూపించమని వేడుకుంటు ప్రార్ధిస్తున్నట్లుగా పరమశివుడి బ్యాక్ డ్రాప్ సాంగ్ వినిపించారు. మొత్తానికి న్యాయదేవతను నమ్ముకుంటే ఊరట దక్కటంలేదన్న భావనతో చివరకు పరమశివుడిని వేడుకుంటున్నట్లున్న ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.





ఏసీబీ కోర్టు నుండి సుప్రింకోర్టు వరకు ప్రఖ్యాత లాయర్లు సిద్దార్ధ లూథ్రా, హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి, సిద్దార్ధ అగర్వాల్, దుబెతో పాటు దాదాపు 48 మంది న్యాయవాదుల బృందం నెలరోజుల నుండి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎంతమంది ఎన్నిరకాలుగా అవస్తలుపడుతున్నా చంద్రబాబును బయటకు తీసుకురాలేకపోతున్నారు. ఇపుడు పరిస్ధితి ఎలాగ తయారైందంటే చంద్రబాబును బయటకు తీసుకురావటం ఒక సమస్య అయితే లోకేష్ ను అరెస్టు కాకుండా కాపాడుకోవటం మరో సమస్యగా మారింది. మరి లోకేష్ విషయంలో ఏమిజరుగుతుందో చూడాలి. 




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో సైడ్ వ్యూలో అలరిస్తున్న సంయుక్త మీనన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>