MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9b0f2d1e-7be2-4fa9-9285-8fb814f500a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9b0f2d1e-7be2-4fa9-9285-8fb814f500a0-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై యాంకర్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు ఓంకార్. అనంతరం రాజు గారి గది సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం రాజుగారి గది 2 3 సినిమాలు కూడా వచ్చి బాగా ఆకట్టుకున్నాయి. ఇవన్నీ హారర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కినవి కావడం విశేషం. ఇక త్వరలోనే 'రాజు గారి గది' పార్ట్ -4 కూడా వచ్చే అవకాశం ఉంది. దానికంటే ముందుగానే ఓంకార్ ఫర్ ది ఫస్ట్ టైం 'మ్యాన్షన్ 24'(Mansion24) పేరుతో ఓ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. ఈ సిరీస్ కూడా హారర్ కథాంశంతో tollywood{#}Bindu;bindhu;nandu;sharath;varalaxmi sarathkumar;Ohmkar;Raju Gari Gadhi 2;Sharrath Marar;Yevaru;king;Father;Tamil;Cinema;Octoberఓంకార్ హారర్ వెబ్ సిరీస్ 'మ్యాన్షన్ 24' రిలీజ్ డేట్..!!ఓంకార్ హారర్ వెబ్ సిరీస్ 'మ్యాన్షన్ 24' రిలీజ్ డేట్..!!tollywood{#}Bindu;bindhu;nandu;sharath;varalaxmi sarathkumar;Ohmkar;Raju Gari Gadhi 2;Sharrath Marar;Yevaru;king;Father;Tamil;Cinema;OctoberWed, 11 Oct 2023 20:45:00 GMTసినిమా తోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం రాజుగారి గది 2 3 సినిమాలు కూడా వచ్చి బాగా ఆకట్టుకున్నాయి. ఇవన్నీ హారర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కినవి కావడం విశేషం. ఇక త్వరలోనే 'రాజు గారి గది' పార్ట్ -4 కూడా వచ్చే అవకాశం ఉంది. దానికంటే ముందుగానే ఓంకార్ ఫర్ ది ఫస్ట్ టైం 'మ్యాన్షన్ 24'(Mansion24) పేరుతో ఓ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. ఈ సిరీస్ కూడా హారర్ కథాంశంతో తెరకెక్కినదే. మొదటిసారి ఈ వెబ్ సిరీస్ తో ఓంకార్ డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సీరిస్ నుంచి వరుసగా పోస్టర్స్ రిలీజ్ చేసి

 క్యూరియాసిటీ పెంచగా, రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ భారీ రెస్పాన్స్ ని అందుకొని సిరీస్ పై మరింత ఆసక్తిని పెంచేసింది. ఓంకార్ మార్క్ ఆఫ్ హారర్ ఎలిమెంట్స్ తో 'మ్యాన్షన్ 24' వెబ్ సిరీస్ ఉండబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మించింది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించి రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు మరో పోస్టర్ని విడుదల చేశారు. అక్టోబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్, సీనియర్ నటుడు సత్యరాజ్, అవికా గోర్, మానస్, బిందు మాధవి, నందు ప్రధాన పాత్రలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. 

మొత్తం 6 ఎపిసోడ్స్ తో హారర్ ఎలిమెంట్స్ తో పాటు సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ గా ఈ సిరీస్ సాగనున్నట్లు సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో 'మ్యాన్షన్ 24' సీరీస్ కథాంశాన్ని మేకర్స్ చెప్పే ప్రయత్నం చేశారు. ఓ పాడు పడ్డ మెన్షన్ లోకి వెళ్లిన కాళిదాస్ (సత్యరాజ్) కనిపించకుండా పోతాడు. ఆయనతోపాటు ఆ మ్యాన్షన్ లోకి వెళ్లిన ఎవరు తిరిగి రారు. తన తండ్రి కోసం కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి ఆ మ్యాన్షన్ లోకి కాళిదాసు కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ అడుగుపెడుతుంది. అక్కడ ఆమెకి ఎలాంటి భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి? అసలు ఆ పాడుబడ్డ మ్యాన్షన్ కథేంటి? కాళిదాసు ఆ మ్యాన్షన్ లోకి ఎందుకు వెళ్ళాడు? అనే అంశాలన్నింటినీ ఈ సిరీస్ లో చూపించబోతున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వింటేజ్ లుక్ లో బికినీ అందాలతో రచ్చ చేస్తున్న లక్ష్మీరాయ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>