PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-cid-irr-scamedaa2e44-0ff1-47bd-afaf-81da6e7cebb2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-cid-irr-scamedaa2e44-0ff1-47bd-afaf-81da6e7cebb2-415x250-IndiaHerald.jpgఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, అంగళ్ళు అల్లర్లలో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కావాలని చంద్రబాబు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ మూడు పిటీషన్లను హైకోర్టు డిస్మిస్ చేసేసింది. ఇప్పటికే స్కిల్ స్కామ్ లో అరెస్టయి 32 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న కారణంగా డీమ్డ్ టు బి కస్టడీ అని కోర్టు చెప్పింది. అంటే స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు బెయిల్ వచ్చి రిలీజ్ అయినా వెంటనే పై మూడు కేసుల్లో దేనిలో అయినా వెంటనే అరెస్టుచేసి మళ్ళీ రిమాండుకు పంపవచ్చు. lokesh cid irr scam{#}Dookudu;CBN;High court;Anti-Corruption Bureau;Rajahmundry;court;Minister;Lokesh;Lokesh Kanagaraj;Wifeఅమరావతి : సీఐడీ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారా ?అమరావతి : సీఐడీ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారా ?lokesh cid irr scam{#}Dookudu;CBN;High court;Anti-Corruption Bureau;Rajahmundry;court;Minister;Lokesh;Lokesh Kanagaraj;WifeWed, 11 Oct 2023 07:00:00 GMT


ఒక్కసారిగా సీఐడీ దూకుడు పెంచినట్లే ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) స్కామ్ లో కొత్తగా నలుగురిని నిందితులుగా చేర్చుతు ఏసీబీ కోర్టులో మెమో దాఖలుచేసింది. ఇప్పటివరకు చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ పైన మాత్రమే సీఐడీ కేసులు నమోదుచేసింది. అలాంటిది తాజాగా నారాయణ భార్య రమాదేవి, ప్రమీల, ఆవుల మణిశంకర్, రాపూరి సాంబశివరావును నిందితులుగా చేర్చింది. వీళ్ళ నలుగురి మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ కోర్టుకు చెప్పింది. అలాగే నారాయణ అల్లుడు పునీత్ ను విచారణకు రావాలని నోటీసులిచ్చింది.





ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, అంగళ్ళు అల్లర్లలో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కావాలని చంద్రబాబు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ మూడు పిటీషన్లను హైకోర్టు డిస్మిస్ చేసేసింది. ఇప్పటికే స్కిల్ స్కామ్ లో అరెస్టయి 32 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న కారణంగా డీమ్డ్ టు బి కస్టడీ అని కోర్టు చెప్పింది. అంటే స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు బెయిల్ వచ్చి రిలీజ్ అయినా వెంటనే పై మూడు కేసుల్లో దేనిలో అయినా వెంటనే అరెస్టుచేసి మళ్ళీ రిమాండుకు పంపవచ్చు.





ఇక నారాయణను కూడా ఇదివరకు రింగ్ స్కామ్ లో  సీఐడీ అరెస్టుచేసింది. బెయిల్ పై బయటున్నారు. అలాంటిది ఇపుడు ఆయన భార్యతో పాటు మరో ముగ్గురు సన్నిహితులపైన కూడా సీఐడీ కేసులు నమోదు చేయటం కీలకమనే చెప్పాలి. అంటే వీళ్ళ నలుగురిని కూడా సీఐడీ ఎప్పుడైనా విచారణకు రమ్మని పిలవచ్చు. 41 ఏ కింద నోటీసిచ్చి విచారణకు పిలిచి అరెస్టు చేయవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వీళ్ళ నలుగురిపైన కూడా సీఐడీ 409 సెక్షన్ పెట్టింది. అంటే  ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూడా సీఐడీ వీళ్ళని అరెస్టు చేయవచ్చు.





వీళ్ళ సంగతిని పక్కనపెట్టేస్తే లోకేష్ విషయంలోనే సస్పెన్స్ కంటిన్యు అవుతోంది. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో లోకేష్ కీలక పాత్రదారుగా సీఐడీ చెబుతోంది. ఈ కేసులో విచారణ కోసమే లోకేష్ కు సీఐడీ నోటీసిచ్చింది. రేపు అంటే 10వ తేదీన సీఐడీ విచారణకు తప్పకుండా హాజరైతీరాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. మరి లోకేష్ ను విచారించి వదిలేస్తారా లేకపోతే అరెస్టు కూడా చేస్తారా అన్న విషయంలో క్లారిటిలేదు. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలవర పెడుతున్న సీక్వెల్స్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>