DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/isreld8e7dfdd-81bc-4d8c-a71e-27d2786122ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/isreld8e7dfdd-81bc-4d8c-a71e-27d2786122ec-415x250-IndiaHerald.jpgఇజ్రాయిల్ లోకి చొరబడిన హమాస్ ఉగ్రవాదులను కట్టడి చేయడానికి ఇజ్రాయిల్ సైన్యం శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే ఇజ్రాయిల్ లోకి చొరబడి ఆ దేశ పౌరులనే కాకుండా ఇతర దేశస్థులను కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అలాగే ఆయా ప్రాంతాల్లో ఇంకా హమాస్ ఉగ్రవాదులు తిష్ట వేసుకుని కూర్చునే ఉన్నారు. ఇలా కిడ్నాప్ చేసిన వారిని హింసిస్తున్న వీడియోలను ఫోటోలను బయటకు వదులుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇజ్రాయిల్ ఆగ్రహంతో ఊగిపోతుంది. చాలా మందిని కాపాడుతున్న ఇంకా ఎంతో మందిని రక్షించాల్సిన అవసరం ఉంది. హమాస్ ఉగ్రవాదులు ఇండisrel{#}Nepal;Terrorists;Israelఇజ్రాయిల్ విదేశీయులను కాపాడలేకపోతుందా?ఇజ్రాయిల్ విదేశీయులను కాపాడలేకపోతుందా?isrel{#}Nepal;Terrorists;IsraelWed, 11 Oct 2023 06:30:00 GMTఇజ్రాయిల్ లోకి చొరబడిన హమాస్ ఉగ్రవాదులను కట్టడి చేయడానికి ఇజ్రాయిల్ సైన్యం శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే ఇజ్రాయిల్ లోకి చొరబడి ఆ దేశ పౌరులనే కాకుండా ఇతర దేశస్థులను కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అలాగే ఆయా ప్రాంతాల్లో ఇంకా హమాస్ ఉగ్రవాదులు తిష్ట వేసుకుని కూర్చునే ఉన్నారు. ఇలా కిడ్నాప్ చేసిన వారిని హింసిస్తున్న వీడియోలను ఫోటోలను బయటకు వదులుతున్నారు.


ఇలా చేయడం వల్ల ఇజ్రాయిల్ ఆగ్రహంతో ఊగిపోతుంది. చాలా మందిని కాపాడుతున్న ఇంకా ఎంతో మందిని రక్షించాల్సిన అవసరం ఉంది. హమాస్ ఉగ్రవాదులు ఇండోనేషియా, నేపాల్ పౌరులను కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయింది. ఇండోనేషియాకు చెందిన దాదాపు 11 మందిని పట్టుకెళ్లినట్లు చెబుతోంది. థాయ్ లాండ్ కు చెందిన దాదాపు 12 మందిని హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు థాయ్ లాండ్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.


తమకు ఇజ్రాయిల్ పాలస్తీనాకు మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని ఇలాంటి సందర్బంలో ఇలా చేయడం సరైనది కాదని థాయ్ లాండ్ హమాస్ ఉగ్రవాదులను హెచ్చరించింది. ఎలాంటి సంబంధం లేని తమ పౌరులను నిర్భంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవసాయ కూలీలను కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. నేపాల్ కు చెందిన 17 మందిని హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. అందులో 6 గురు తప్పించుకొని వచ్చినట్లు తెలుస్తుంది.


అదే సమయంలో ఇజ్రాయిల్ లో హమాస్ తీవ్రవాదుల విధ్వంస కాండ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కాల్పుల్లో అమెరికాకు చెందిన నలుగురు పౌరులు కూడా చనిపోయినట్లు తెలుపుతున్నారు. ఇంకా ఇజ్రాయిల్ లోని అనేక ప్రాంతాల్లో హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని వారిని ఏరిపారేసే ఆపరేషన్ జరుగుతుందని ఇజ్రాయిల్ ప్రభుత్వం తెలిపింది. ఉగ్రవాదుల చెరలో బంధీలుగా ఉన్న వారిని విడిపించడానికి చేయాల్సిన అన్ని పనులను చేస్తున్నామని ఇజ్రాయిల్ పేర్కొంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలవర పెడుతున్న సీక్వెల్స్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>