PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-acb-court-balances-chandrababu-and-cid-petitions7d2101f9-dddf-434b-8271-d343f9f86a07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-acb-court-balances-chandrababu-and-cid-petitions7d2101f9-dddf-434b-8271-d343f9f86a07-415x250-IndiaHerald.jpgఇక్కడ విషయం ఏమిటంటే చంద్రబాబుకు ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రింకోర్టు ఎక్కడికి వెళ్ళినా ఊరట దక్కటంలేదు. ఇపుడు ఏసీబీ కోర్టులోనే పిటీ వారెంట్లపై విచారణ జరుగుతోంది. రెండు పీటీ వారంట్లపై తమవైపు నుండి వాదనలు వినిపించాల్సిన అవసరంలేదని సీఐడీ లాయర్లు కోర్టుకు చెప్పారు. నేరుగా తీర్పు చెప్పేస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. అయితే తమ వాదనలు వినాల్సిందే అని చంద్రబాబు లాయర్లు పట్టుబట్టి వాదనలు మొదలుపెట్టారు. acb court chandrababu skill scam{#}CBN;High court;Anti-Corruption Bureau;court;mondayఅమరావతి : ఏసీబీ కోర్టు బ్యాలెన్స్ చేసిందా ?అమరావతి : ఏసీబీ కోర్టు బ్యాలెన్స్ చేసిందా ?acb court chandrababu skill scam{#}CBN;High court;Anti-Corruption Bureau;court;mondayWed, 11 Oct 2023 05:00:00 GMT


మొత్తానికి రెండు వైపుల పిటీషన్లను విచారించిన ఏసిబీ కోర్టు రెండు వైపులా బ్యాలెన్స్ చేసినట్లే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే స్కిల్ స్కామ్ లో అరెస్టయి రిమాండులో ఉన్న చంద్రబాబునాయుడును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ వాదించింది. అలాగే తమ క్లైంటుకు బెయిల్ ఇవ్వాల్సిందే అని చంద్రబాబు తరపు లాయర్లు వాదించారు. రెండు వైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు జడ్జి సోమవారం తీర్పుచెప్పారు. రెండు పిటీషన్లను కొట్టేశారు. అంటే ఒకవిధంగా చంద్రబాబుకు పెద్ద ఊరట దక్కినట్లుగానే అనుకోవాలి.





కోర్టు గనుక సీఐడీ వాదనకు అనుకూలంగా కస్టడీకి ఓకే చెప్పుంటే చంద్రబాబు పరిస్ధితి చాలా ఘోరంగా ఉండేది. ఎలాగంటే కస్టడీ తొలగించి బెయిల్ ఇవ్వాలని ఏసీబీ కోర్టులోనే మరికొద్దిరోజులు పోరాటాలు చేస్తుండాల్సొచ్చేది. ఇపుడేమైందంటే ఇటు సీఐడీ అటు చంద్రబాబు తమ వాదనలకు మద్దతుగా హైకోర్టులో పిటీషన్లు వేయబోతున్నారు. గడచిన నెలరోజులుగా అనేక పిటీషన్లు విచారించిన ఏసీబీ కోర్టు తనపైన ఉన్న పెద్ద భారాన్ని హైకోర్టు మీద పెట్టినట్లుగా భావించాలి.





ఇక్కడ విషయం ఏమిటంటే చంద్రబాబుకు ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రింకోర్టు ఎక్కడికి వెళ్ళినా ఊరట దక్కటంలేదు. ఇపుడు ఏసీబీ కోర్టులోనే పిటీ వారెంట్లపై విచారణ జరుగుతోంది. రెండు పీటీ వారంట్లపై తమవైపు నుండి వాదనలు వినిపించాల్సిన అవసరంలేదని సీఐడీ లాయర్లు కోర్టుకు చెప్పారు. నేరుగా తీర్పు చెప్పేస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. అయితే తమ వాదనలు వినాల్సిందే అని చంద్రబాబు లాయర్లు పట్టుబట్టి వాదనలు మొదలుపెట్టారు.





చంద్రబాబు లాయర్లు వాదనలు మొదలుపెట్టారు కాబట్టి సీఐడీ లాయర్లు కూడా వాదనలు వినిపిస్తారా ? లేకపోతే ఏకపక్ష వాదనలతోనే తీర్పుచెప్పమని  అడుగుతారా అన్నది చూడాలి. చంద్రబాబు లాయర్లు వేసిన ప్రతి పిటీషన్ పైన వాదనలు వినిపించిన సీఐడీ లాయర్లు పీటీ వారెంట్ల విషయంలో మాత్రం తమ వాదనలు వినిపించాల్సిన అవసరంలేదని ఎందుకు అనుకున్నారో అర్ధంకావటంలేదు. ఏదేమైనా అన్నీ పిటీషన్లలోను ఎదురు దెబ్బలు తగులుతున్న చంద్రబాబుకు సీఐడీ పిటీషన్ డిస్మిస్ చేయటం కాస్త ఊరటనే చెప్పాలి. మరిదే పిటీషన్ పై హైకోర్టు ఏమంటుందో చూడాలి.  




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : ఏసీబీ కోర్టు బ్యాలెన్స్ చేసిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>