HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/face-glow0a0b2e3f-a21d-4e09-a844-9ce3503c973d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/face-glow0a0b2e3f-a21d-4e09-a844-9ce3503c973d-415x250-IndiaHerald.jpgసాధారణంగా నల్ల నువ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలుసు కదా. నల్ల నువ్వులను తరచూ తినడం వల్ల, రక్త కణాలు వృద్ధి చెందడం,హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గడం వంటి ప్రయోజనాలు పుష్కళంగా లభిస్తాయి.అదే నల్ల నువ్వులను ముఖాన్ని మెరిపించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయని చర్మ నిపుణులు చెబుతున్నారు.అదేలానో మనము తెలుసుకుందాం పదండీ.. మనలో చాలా మంది ముఖం మీద ఎటువంటి మొటిమలు,మచ్చలు,మృతకణాలు లేకుండా అందంగా తెల్లగా మెరిసిపోవాలని ఎవరికి ఉండదు చెప్పండి.కానీ ముఖం మీద మృతకణాలు, మొటిమలు,నల్లని మచ్చలు,మంగFACE;GLOW{#}Air;Eveningనల్ల నువ్వులతో ముఖాన్ని మెరిపించండిలా..!నల్ల నువ్వులతో ముఖాన్ని మెరిపించండిలా..!FACE;GLOW{#}Air;EveningWed, 11 Oct 2023 06:00:00 GMTసాధారణంగా నల్ల నువ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలుసు కదా. నల్ల నువ్వులను తరచూ తినడం వల్ల, రక్త కణాలు వృద్ధి చెందడం,హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గడం వంటి ప్రయోజనాలు పుష్కళంగా లభిస్తాయి.అదే నల్ల నువ్వులను ముఖాన్ని మెరిపించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయని చర్మ నిపుణులు చెబుతున్నారు.అదేలానో మనము తెలుసుకుందాం పదండీ..

మనలో చాలా మంది ముఖం మీద ఎటువంటి మొటిమలు,మచ్చలు,మృతకణాలు లేకుండా అందంగా తెల్లగా మెరిసిపోవాలని ఎవరికి ఉండదు చెప్పండి.కానీ ముఖం మీద మృతకణాలు, మొటిమలు,నల్లని మచ్చలు,మంగు మచ్చలు వంటివి ఉండడంతో అందవిహీనంగా తయారవుతుంది.అలాంటి వారికి ఆత్మ విశ్వాసం కూడా దెబ్బతిని, పది మందిలో అంతగా కలవలేరు కూడా.

ఈ సమస్యకు వంటింట్లోనే మంచి నివారణ ఉంది.మన వంటింటిలో ఉండే కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించి ఎటువంటి సమస్యలా నుంచి అయినా తొందరగా బయట పడవచ్చు.దీని కోసం ఒక స్పూన్ నల్ల నువ్వులను తీసుకొని,వేయించి మెత్తని పొడిగా చేసుకోవాలి.ఈ పొడిని గాలి చొరబడని సీసాలో ఎక్కువ మొత్తంలో,ఎక్కువ కాలం పాటు నిల్వ చేసుకోవచ్చు.ఇప్పుడు ఒక గిన్నెలో ఒక స్పూన్ నువ్వుల పొడి,చిటికెడు పసుపు,కొంచెం నీటిని పోసి బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి గంట సేపు ఆరనివ్వాలి. ఇది బాగా ఆరాక గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకొని, మాయిశ్చరైసర్  రాసుకోవాలి.ఇలానే రోజూ ఉదయం సాయంత్రం చేస్తూ ఉంటే క్రమంగా మొఖంపై గల మచ్చలన్నీ తొలగిపోయి,ముఖం అందంగా,తెల్లగా కాంతివంతంగా తయారవుతుంది.ఈ చిట్కా చాలా మంది మొఖంలో మెరుపు తెచ్చింది కూడా.

నల్ల నువ్వులలో ఉండే లక్షణాలు చర్మ సమస్యలను, చర్మ వాపులను తగ్గించటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.అలాగే ఇందులో వాడే పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు మచ్చలను తొలగించి చర్మం ఆరోగ్యంగా అందంగా తెల్లగా మెరిసేందుకు దోహదపడుతుంది.చర్మం డిహైషన్ కి గురి కాకుండా తగినంత నీరు తాగడం,తగినంత పోషకాలు కలిగిన ఆహారం తినడం కూడా చాలా ముఖ్యం



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలవర పెడుతున్న సీక్వెల్స్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>