HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtha800ca4d-2051-4654-9013-659261c8da92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtha800ca4d-2051-4654-9013-659261c8da92-415x250-IndiaHerald.jpgనిత్యం జీవించడానికి, చర్మ సమస్యలకు దూరంగా ఉండటానికి ప్రతి రోజూ స్నానం చేయడం చాలా అవసరం. అయితే స్నానం చేసేటప్పుడు తెలిసో తెలియకో కొన్నిరకాల తప్పులు చేయడం వల్ల ఖచ్చితంగా అనారోగ్యం బారీన పడుతుంటారు.అందుకే దీనిని నివారించాలంటే ఖచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..మాములుగా వెచ్చని నీళ్లలో స్నానం చేయడం వల్ల విశ్రాంతి లభిస్తుందని చాలా మంది కూడా భావిస్తుంటారు. అయితే ఎక్కువ సేపు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే సహజ నూనె ఇంకా తేమ కోల్పోవడంHealth{#}oil;Manamస్నానం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి?స్నానం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి?Health{#}oil;ManamTue, 10 Oct 2023 21:25:00 GMTనిత్యం జీవించడానికి, చర్మ సమస్యలకు దూరంగా ఉండటానికి ప్రతి రోజూ స్నానం చేయడం చాలా అవసరం. అయితే స్నానం చేసేటప్పుడు తెలిసో తెలియకో కొన్నిరకాల తప్పులు చేయడం వల్ల ఖచ్చితంగా అనారోగ్యం బారీన పడుతుంటారు.అందుకే దీనిని నివారించాలంటే ఖచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..మాములుగా వెచ్చని నీళ్లలో స్నానం చేయడం వల్ల విశ్రాంతి లభిస్తుందని చాలా మంది కూడా భావిస్తుంటారు. అయితే ఎక్కువ సేపు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే సహజ నూనె ఇంకా తేమ కోల్పోవడం జరుగుతుంది. అందువల్లనే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి.మనం లూఫాతో చర్మాన్ని బాగా స్క్రబ్ చేసి శుభ్రం చేయాలి. అయితే చాలా మంది కూడా తమ గోళ్లతో చర్మాన్ని రుద్దుతుంటారు. అయితే చర్మాన్ని ఎక్కువగా స్క్రబ్ చేస్తే దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. లూఫా వినియోగించేవారు స్నానం చేసిన తర్వాత దానిని పూర్తిగా శుభ్రం చేసి, ఆరబెట్టుకోవాలి.


ఇక తడి లూఫాలలో చర్మానికి హానితలపెట్టే బ్యాక్టీరియా చేరుతుంది. కాబట్టి వాటిని స్నానం చేసే ప్రతిసారీ కూడా ఖచ్చితంగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి.అలాగే ఒత్తిడితో చర్మాన్ని అస్సలు రుద్ద కూడదు. షాంపూ రాసుకున్న తర్వాత చాలా మంది కూడా తలలో చేతి వేళ్లతో బలంగా రుద్దుతారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల తలకు రక్తప్రసరణ పెరగడానికి బదులు జుట్టు రాలిపోతుంది.ఇక ఎక్కువగా స్కాల్ప్ స్క్రబ్బింగ్ చేయడం వల్ల చివర్లు చీలిపోతాయి.అలాగే చర్మాన్ని శుభ్రం చేయడానికి చాలా మంది సబ్బు వినియోగిస్తుంటారు.అయితే సరైన సబ్బును ఎంపిక చేసుకోవడం కూడా ఖచ్చితంగా చాలా ముఖ్యం.ఎందుకంటే సబ్బులో ఆల్కలీ ఉంటుంది. ఇది చర్మం సహజ నూనెలను నాశనం చేసి, చర్మాన్ని పొడిగా ఇంకా గరుకుగా మార్చుతుంది. అయితే సబ్బుకు బదులుగా షవర్ జెల్ లేదా బాడీ వాష్‌ని ఎంచుకోవచ్చు.స్నానం చేసిన తర్వాత కూడా చర్మాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన శరీరం పూర్తిగా ఆరిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. తడి చర్మంపై మాయిశ్చరైజర్ అస్సలు రాసుకోకూడదు. మాయిశ్చరైజర్ చర్మం తేమను నిలుపుకోవడంలో బాగా సహాయపడుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం అలా చేస్తున్న ఉపాసన..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>