MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4d9844b8-3046-4c4a-8e1f-333667765184-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4d9844b8-3046-4c4a-8e1f-333667765184-415x250-IndiaHerald.jpgకలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ వంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సుహాస్. ఈయన నటించిన ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. దాంతో ప్రస్తుతం వరుస సినిమాలో చేస్తూ దూసుకుపోతున్నాడు. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించాడు. ఆ తర్వాత 'ఫ్యామిలీ డ్రామా' అనే మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక అడవి శేష్ నటించిన 'హిట్ 2' సినిమాలో ఏకంగా విలన్ గా తన నటనతో ఆకట్టుకొని యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.tollywood{#}sekhar chandra;suhas;Love Story;Posters;Girl;Love;Leader;Audience;Tollywood;Heroine;Success;Cinemaసోషల్ మీడియాలో దూసుకుపోతున్న 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్' టీజర్..!!సోషల్ మీడియాలో దూసుకుపోతున్న 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్' టీజర్..!!tollywood{#}sekhar chandra;suhas;Love Story;Posters;Girl;Love;Leader;Audience;Tollywood;Heroine;Success;CinemaTue, 10 Oct 2023 20:55:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సుహాస్. ఈయన నటించిన ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. దాంతో ప్రస్తుతం వరుస సినిమాలో చేస్తూ దూసుకుపోతున్నాడు.  మొదటి సినిమాతోనే తన నటనతో ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించాడు. ఆ తర్వాత 'ఫ్యామిలీ డ్రామా' అనే మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక అడవి శేష్ నటించిన 'హిట్ 2' సినిమాలో ఏకంగా విలన్ గా తన నటనతో ఆకట్టుకొని యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. రీసెంట్ గా 'రైటర్ పద్మభూషణ్' తో మంచి సక్సెస్ అందుకున్న సుహాస్ తాజాగా 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' అనే

 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహించారు. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచగా తాజాగా చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఫన్ మూమెంట్స్ తో స్టార్ట్ అయిన టీజర్ చాలా ఎమోషనల్ గా ఎండ్ అయింది. టీజర్ ని గమనిస్తే..' చెప్పవే చిరునామా అంటూ బ్యాండ్ మ్యూజిక్ తో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం లవ్ కంఫర్ట్ యాక్షన్ తో సాగింది. మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్ లో సుహాస్ నటించారు. టీజర్ లో హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. సుహాస్ ఫన్ తో పాటు సీరియస్ యాక్టింగ్, ఫైట్స్ కూడా చేశాడు. 

చివర్లో ఏదో కోల్పోయి గుండు కూడా గీయించుకున్నట్టు కనిపించాడు. శేఖర్ చంద్ర అందించిన బీజీయం కూడా ఆకట్టుకుంది'. ఊర్లో సెలూన్ నడుపుతూనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో డప్పు కొడుతూ ఉండే మల్లిని కాలేజ్ లో ఒక అమ్మాయి ఇష్టపడుతుంది. వీరిద్దరి లవ్ స్టోరీ ఎక్కడివరకు వెళ్ళింది.. ? అసలు మల్లి కథలోకి వచ్చిన మరో ఇద్దరు ఎవరు? అనేది సినిమా చేసే తెలుసుకోవాలి. మొత్తం గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ తో మరోసారి సుహాస్ ఫన్ తో పాటు ఆడియన్స్ ని ఎమోషనల్ చేసేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. టీజర్ చివరిలో సుహాస్ కు గుండు కొట్టిస్తూ ఉన్న షాట్ చూస్తుంటే. సినిమా కోసం సుహాస్ ఎంత రిస్క్ చేశాడనేది అర్ధం అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ వైరల్ గా మారింది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం అలా చేస్తున్న ఉపాసన..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>