PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/election-commission-shocks-kcr-689c0989-0d2a-4529-95d9-dcff5932e063-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/election-commission-shocks-kcr-689c0989-0d2a-4529-95d9-dcff5932e063-415x250-IndiaHerald.jpgబహుశా ఈ విషయం ఊహించే మూడురోజుల క్రితం స్కూళ్ళల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రకటించి అమల్లోకి కూడా తెచ్చేశారు. సుమారు 27 లక్షలమంది విద్యార్ధులకు లబ్దిపొందే ఈ పథకం కచ్చితంగా ఎన్నికల్లో లబ్దిపొందేందుకే అని అందరికీ తెలుసు. అయినా ఎవరు ఏమీచేయలేరు. ఎందుకంటే ఎప్పుడే పథకాన్ని ప్రారంభించటం అన్నది ప్రభుత్వం ఇష్టంకాబట్టి. ఎన్నికల కమీషన్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటిస్తుందనే అనుమానంతోనే కేసీయార్ సడెన్ గా పథకాన్ని ప్రకటించింది.kcr telangana{#}KCR;Congress;central government;Bharatiya Janata Party;Government;monday;Yevaruహైదరాబాద్ : కేసీయార్ కు ఎన్నికల కమీషన్ షాక్హైదరాబాద్ : కేసీయార్ కు ఎన్నికల కమీషన్ షాక్kcr telangana{#}KCR;Congress;central government;Bharatiya Janata Party;Government;monday;YevaruTue, 10 Oct 2023 09:00:00 GMT


కేసీయార్ తో పాటు బీజేపీకి కేంద్ర ఎన్నికల కమీషన్ పెద్ద షాకే ఇచ్చింది. ఎలాగంటే సోమవారం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించటం ద్వారా. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ ను కమీషన్ ప్రకటించిందంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసినట్లే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నపుడు ప్రభుత్వం కొత్త పథకాలేవీ ప్రారంభించేందుకు లేదు.  అలాగే ప్రభుత్వ పరంగా పథకాలను ప్రకటించేందుకు కూడా లేదు.





బహుశా ఈ విషయం ఊహించే మూడురోజుల క్రితం స్కూళ్ళల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రకటించి అమల్లోకి కూడా తెచ్చేశారు. సుమారు 27 లక్షలమంది విద్యార్ధులకు లబ్దిపొందే ఈ పథకం కచ్చితంగా ఎన్నికల్లో లబ్దిపొందేందుకే అని అందరికీ తెలుసు. అయినా ఎవరు ఏమీచేయలేరు. ఎందుకంటే ఎప్పుడే పథకాన్ని ప్రారంభించటం అన్నది ప్రభుత్వం ఇష్టంకాబట్టి. ఎన్నికల కమీషన్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటిస్తుందనే అనుమానంతోనే కేసీయార్ సడెన్ గా పథకాన్ని ప్రకటించింది.





ఈనెల 16వ తేదీన వరంగల్లో జరగబోయే సింహగర్జన బహిరంగసభలో మరిన్ని పథకాలను ప్రకటించేందుకు కేసీయార్ కసరత్తు చేస్తున్నారని పార్టీవర్గాల టాక్. అయితే తాజాగా ప్రకటించిన షెడ్యూల్ కారణంగా కేసీయార్ ఇక కొత్త పథకాలను ప్రకటించేందుకు లేదు ప్రారంభించేందుకు కూడా లేదు. కాకపోతే బీఆర్ఎస్ అధినేతగా రాబోయే ఎన్నికల్లో పార్టీపరంగా జనాలకు హామీలు ఇవ్వవచ్చంతే. ఇదే సమయంలో మళ్ళీ తాము అధికారంలోకి వస్తే అందించబోయే పథకాలను మ్యానిఫెస్టో రూపంలో ప్రకటించచ్చంతే.





ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డిక్లరేషన్లు, హామీలు, సిక్స్ గ్యారెంటీస్ పేరుతో అనేక హామీలను ప్రకటించేసింది. సోనియాగాంధి, రాహుల్, ప్రియాంకగాంధిలను తెలంగాణాలో పర్యటనలకు పిలిపించటం ద్వారా మైనారిటీలు, రైతులు, యూత్, మహిళలకు డిక్లరేషన్ల పేర్లతో హామీలను ప్రకటించింది. కాబట్టి కాంగ్రెస్ తరపున కొత్తగా జనాలకు రాబోయే హామీలు పెద్దగా లేవనే చెప్పాలి. ఇక బీజేపీ విషయానికి వస్తే ఇప్పటివరకు ఇచ్చిన హామీలు లేవనే చెప్పాలి. మరి జనాలకు ఇవ్వబోయే హామీలు, మ్యానిఫెస్టోపై ఎలాంటి కసరత్తు జరుగుతోందో తెలీదు.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంత్రి రోజాకి ప్రపోజ్ చేసి.. సెల్వమణి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>