MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఒకప్పుడు చిరంజీవి వెంకటేష్ మహేష్ లతో అనేక హిట్ సినిమాలాను తీసిన దర్శకుడు శ్రీను వైట్ల ఒకప్పుడు టాప్ దర్శకుల లిస్టులో కొనసాగుతూ ఉండేవాడు. ‘దూకుడు’ మూవీ తరువాత మహేష్ తో ‘ఆగడు’ మూవీని చేసినప్పటి నుండి శ్రీను వైట్ల కెరియర్ గ్రాఫ్ బాగా పడిపోయింది. అయితే ఇలాంటి విషయాలను లెక్కచేయకుండా పరిస్థితులతో పోరాటం చేస్తూ అతడు తీసిన ‘బ్రూస్లీ’ ‘మిష్టర్’ ‘అమర్ అక్బర్ యాంటోని’ సినిమాలు వరసగా భయంకరమైన ఫ్లాప్ లుగా మారడంతో శ్రీను వైట్ల పేరు చెపితే టాలీవుడ్ హీరోలు పారిపోయారు అన్న ప్రచారం కూడ జరిగినది. ఆమధ్య మంచు విSRINUVAITLA{#}Chiranjeevi;srinu vytla;Europe countries;Athadu;Tollywood;Darsakudu;Hero;Director;Cinemaమారని శ్రీను వైట్ల !మారని శ్రీను వైట్ల !SRINUVAITLA{#}Chiranjeevi;srinu vytla;Europe countries;Athadu;Tollywood;Darsakudu;Hero;Director;CinemaTue, 10 Oct 2023 10:00:00 GMTఒకప్పుడు చిరంజీవి వెంకటేష్ మహేష్ లతో అనేక హిట్ సినిమాలాను తీసిన దర్శకుడు శ్రీను వైట్ల ఒకప్పుడు టాప్ దర్శకుల లిస్టులో కొనసాగుతూ ఉండేవాడు. ‘దూకుడు’ మూవీ తరువాత మహేష్ తో ‘ఆగడు’ మూవీని చేసినప్పటి నుండి శ్రీను వైట్ల కెరియర్ గ్రాఫ్ బాగా పడిపోయింది. అయితే ఇలాంటి విషయాలను లెక్కచేయకుండా పరిస్థితులతో పోరాటం చేస్తూ అతడు తీసిన ‘బ్రూస్లీ’ ‘మిష్టర్’ ‘అమర్ అక్బర్ యాంటోని’ సినిమాలు వరసగా భయంకరమైన ఫ్లాప్ లుగా మారడంతో శ్రీను వైట్ల పేరు చెపితే టాలీవుడ్ హీరోలు పారిపోయారు అన్న ప్రచారం కూడ జరిగినది.



ఆమధ్య మంచు విష్ణుతో ఒక సినిమాను తీయడానికి చేసిన ప్రయత్నాలు ముందుకు సాగక పోవడంతో ఇక ఈ దర్శకుడు కెరియర్ ముగిసి పోయినట్లే అని అంతా భావించారు. అలాంటి పరిస్థితుల మధ్య హీరో గోపీచంద్ శ్రీను వైట్ల కాంబినేషన్ సెట్ అవ్వడంతో మళ్ళీ ఈ దర్శకుడి హవా మొదలవుతుంది అని అంతా భావిస్తున్నారు.  



అయితే ఈ సినిమా షూటింగ్ ను ఏకంగా యూరప్ లోని మిలాన్ దేశంలో ఒక భారీ సెట్ వేసి అక్కడ ఈసినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తి చేయడంతో ఈ మూవీ నిర్మాత ఏధైర్యంతో గోపీచంద్ శ్రీను వైట్ల కాంబినేషన్ పై ఇంత భారీగా ఖర్చు పెడుతున్నాడు అంటూ కొందరు షాక్ అవుతున్నారు. ఈ షూటింగ్ కు సంబంధించిన ఒక వీడియోను శ్రీను వైట్ల సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దర్శకుడు భారీ తనం పై కాకుండా సినిమా కథ విషయంలో అదేవిధంగా కంటెంట్ విషయంలో శ్రద్ధ పెడితే బాగుంటుంది కదా అంటూ కొందరు శ్రీను వైట్లకు ఉచిత సలహాలు ఇస్తున్నారు.



సినిమా విజయం ఒక ఫెయిల్యూర్ హీరోకు అదేవిధంగా మరో ఫెయిల్యూర్ దర్శకుడుకి కీలకంగా మారిన పరిస్థితులలో ఇప్పటికీ శ్రీను వైట్ల మారకపోతే ఇక అతడి కెరియర్ నిలదొక్కుకోవడం కష్టం అవుతుంది అంటూ అతడి అభిమానులు అభిప్రాయపడుతున్నారు..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంత్రి రోజాకి ప్రపోజ్ చేసి.. సెల్వమణి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>