MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood16d2552b-088c-429e-ba5c-dffe9fcd82dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood16d2552b-088c-429e-ba5c-dffe9fcd82dc-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా లియో. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నేలకొన్నాయి. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ సైతం విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ సైతం భారీ రెస్పాన్స్ ను అందుకుంది. ఇక 'లియో' ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఓ ఇంటర్వ్యూలో 'లియో' మూవీ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమని స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ సర్ ప్రైజ్ ఎంట్రీ కూడా ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. tollywood{#}Lokesh;vikram;Kollywood;producer;Producer;Prize;Joseph Vijay;Lokesh Kanagaraj;Director;Darsakudu;Cinema;Audience'లియో' లో కమల్ హాసన్ ఎంట్రీ..!!'లియో' లో కమల్ హాసన్ ఎంట్రీ..!!tollywood{#}Lokesh;vikram;Kollywood;producer;Producer;Prize;Joseph Vijay;Lokesh Kanagaraj;Director;Darsakudu;Cinema;AudienceTue, 10 Oct 2023 20:40:20 GMTకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా లియో. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నేలకొన్నాయి. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ సైతం విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ సైతం భారీ రెస్పాన్స్ ను అందుకుంది. ఇక 'లియో' ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఓ ఇంటర్వ్యూలో 'లియో' మూవీ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమని స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ సర్ ప్రైజ్ ఎంట్రీ కూడా ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

లేటెస్ట్ కోలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం, లియో మూవీలో కమల్ హాసన్ వాయిస్ ఓవర్ ఉంటుందట. సినిమా క్లైమాక్స్ లో కమల్ వాయిస్ ఓవర్ వస్తుందని, లియో తర్వాత లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో విక్రమ్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. అంటే లియో తర్వాత ఇదే యూనివర్స్ నుంచి 'విక్రమ్ 2' వస్తుందన్నమాట. అంతేకాకుండా కమల్ వాయిస్ మాత్రమే కాకుండా క్లైమాక్స్ లో విక్రమ్ సర్ప్రైజింగ్ ఎంట్రీ కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ పరోక్షంగా వెల్లడించారు. లియో లో మీరు ఊహించని సర్ప్రైజ్ లు ఉంటాయని వాటిని ఇప్పుడే

 చెప్పదలుచుకోలేదని అన్నాడు. దీంతో లియో లో కచ్చితంగా కమల్ ఎంట్రీ ఉంటుందని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ లో వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ ఇంటర్వ్యూల్లోనే లియో పై రకరకాల హింట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను తారస్థాయికి తీసుకెళ్తున్నాడు." మరో పది రోజులు ఆగండి మీకే తెలుస్తుంది. సినిమాలో చాలా విషయాలని కావాలనే మేము దాచిపెట్టాం. ప్రేక్షకులు వాటిని పూర్తిగా థియేటర్స్ లో ఎక్స్ పీరియన్స్ చేయాలని అలా చేశాం" అంటూ చిత్ర నిర్మాత కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మూవీ టీం సినిమాలో చాలా విషయాలను దాచి పెట్టమని అధికారికంగా స్పష్టం చేస్తుండడంతో కచ్చితంగా అ మూవీలో కమల్ ఎంట్రీ ఉంటుందని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం అలా చేస్తున్న ఉపాసన..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>