Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb1f17706-0cfe-4463-8b8a-9593f5f2f0e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb1f17706-0cfe-4463-8b8a-9593f5f2f0e1-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమంలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులందరికీ మాస్ మహారాజా గా మారిపోయాడు రవితేజ. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒకప్పుడు దొంగతనాలతో సంచలనాలు సృష్టించిన స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతూ ఉంది. ఇక మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగTollywood{#}bellamkonda sai sreenivas;Thief;Donga;Hero;Akkineni Nageswara Rao;Mass;October;India;Telugu;Director;Cinemaరవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' కోసం.. ముందుగా అనుకున్న హీరో ఎవరో తెలుసా?రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' కోసం.. ముందుగా అనుకున్న హీరో ఎవరో తెలుసా?Tollywood{#}bellamkonda sai sreenivas;Thief;Donga;Hero;Akkineni Nageswara Rao;Mass;October;India;Telugu;Director;CinemaTue, 10 Oct 2023 10:30:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమంలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులందరికీ మాస్ మహారాజా గా మారిపోయాడు రవితేజ. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒకప్పుడు దొంగతనాలతో సంచలనాలు సృష్టించిన స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతూ ఉంది.


 ఇక మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా అటు చిత్రబృందం మాత్రం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పాలి. సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ముందుగా రవితేజను హీరోగా తీసుకోవాలని అనుకోలేదట డైరెక్టర్ వంశీ. ముందుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అయితే ఈ సినిమాలో హీరో పాత్రకి సరిగ్గా సెట్ అవుతాడని అనుకున్నాడట. ఈ క్రమంలోనే ముందుగా ఈ యంగ్ హీరో దగ్గరికి వెళ్లి సినిమా కథను కూడా వినిపించాడట. కానీ అతనికి అప్పటికి నాలుగు సినిమాలు లైనప్ లో ఉండడంతో సినిమా లేట్ అవుతుందని అనుకున్నాడట డైరెక్టర్ వంశీ.


 దీంతో వేరే హీరోతో సినిమా చేస్తానని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు చెబితే అతను కూడా ఓకే చెప్పాడట. ఇక తర్వాత రవితేజకు కథ వినిపించడం ఆయన ఓకే చేయడం.. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం చకచక జరిగిపోయింది అని డైరెక్టర్ చెప్పుకొచ్చారు  అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమా చేయాలనుకున్నప్పుడు ఎంతో కాలం పాటు రీసెర్చ్ చేశాను అంటూ ఆయన తెలిపారు. కాగా అక్టోబర్ 19వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్టువర్టుపురం దొంగ అని టైగర్ నాగేశ్వరరావు జీవిత కథను ప్రకటించినప్పటికీ ఈ సినిమా ఆగిపోయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంత్రి రోజాకి ప్రపోజ్ చేసి.. సెల్వమణి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>