Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc07102742-a7d0-496d-a9b3-524f6cf50ef6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc07102742-a7d0-496d-a9b3-524f6cf50ef6-415x250-IndiaHerald.jpgభారత్-పాక్ మ్యాచ్ వేళ భారీ భద్రత... అనుమతిలేనిదే ఒక్క ఈగకూడ లోనికి వెళ్లలేదు! అవును, క్రికెట్ అనే మహా సంగ్రామంలో 2 శతృదేశాలు తలపడనున్నాయి. వరల్డ్ కప్ 23లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు గుజరాత్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికైంది. ఈ శనివారం అనగా జరిగే ఈ మ్యాచ్కు అధికారులు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు షురూ చేశారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈమెయిల్ రావడం వల్ల మరింత అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు మ్యాచ్ జరిగే రోజు నగరాన్ని పూర్తిగా తమ గుIcc{#}Anu Malik;Ahmedabad;Narendra Modi;Maha;House;police;World Cup;Cricket;Audience;Saturday;mediaభారత్-పాక్ మ్యాచ్ వేళ భారీ భద్రత... అనుమతిలేనిదే ఒక్క ఈగకూడ లోనికి వెళ్లలేదు?భారత్-పాక్ మ్యాచ్ వేళ భారీ భద్రత... అనుమతిలేనిదే ఒక్క ఈగకూడ లోనికి వెళ్లలేదు?Icc{#}Anu Malik;Ahmedabad;Narendra Modi;Maha;House;police;World Cup;Cricket;Audience;Saturday;mediaTue, 10 Oct 2023 16:13:00 GMT

అవును, క్రికెట్ అనే మహా సంగ్రామంలో 2 శతృదేశాలు తలపడనున్నాయి. వరల్డ్ కప్ 23లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు గుజరాత్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికైంది. ఈ శనివారం అనగా జరిగే ఈ మ్యాచ్కు అధికారులు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు షురూ చేశారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈమెయిల్ రావడం వల్ల మరింత అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు మ్యాచ్ జరిగే రోజు నగరాన్ని పూర్తిగా తమ గుప్పెట్లోకి తీసుకోనున్నారు. ఈ నేపధ్యంలోనే మ్యాచ్ జరుగుతున్న అహ్మదాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నామని అహ్మదాబాద్ కమిషనర్ జీఎస్ మాలిక్ తాజాగా ఓ మీడియా సమావేశంలో తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... “స్థానిక పోలీసులు, హోమ్ గార్డులతోసహా నేషనల్ సెక్యూరిటీ గార్డ్- ఎన్ఎస్‌జీ కమాండోలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను రంగంలోకి దించి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నాం. 7000 వేల మంది పోలీసులతో పాటు మరో 4000 మంది హోంగార్డులు మోహరిస్తారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు, స్టేడియం పరిసరాల్లో.. నగరంలోని సున్నిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాటు కల్పిస్తున్నాం.” అని వెల్లడించారు. కాగా మొత్తం 11 వేల మందికి పైగా భద్రతా సిబ్బందితో ఆ రోజు నగరం మొత్తం పోలీసులు ఆధీనంలోకి వెళ్లిపోనుంది.

దాదాపుగా లక్ష మందికి పైగా ప్రేక్షకులు ఈ మ్యాచ్ చూడటానికి వస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జీఎస్ మాలిక్ తెలిపారు. ఇకపోతే గత 20 ఏళ్ల కాలంలో అహ్మదాబాద్లో క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని ఆయన గుర్తు చేశారు. భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా చేసిన భద్రతా ఏర్పాట్ల గురించి మీడియాకు మాలిక్ వివరించిన మాలిక్.. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ (సీబీఆర్ఎన్) వంటి దాడులు జరిగినా వెంటనే స్పందించేలా భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూడా మోహరిస్తున్నట్లు తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇండియన్ 2 నుండి అప్డేట్.. మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>