PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-sujana-modia5ec4595-d2e7-491f-8be5-9ce01f5218d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-sujana-modia5ec4595-d2e7-491f-8be5-9ce01f5218d0-415x250-IndiaHerald.jpgవిషయం ఏమిటంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్ అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లేవు. చేస్తున్న ఆరోపణలన్నీ చంద్రబాబునాయుడు, లోకేష్, తమ్ముళ్ళు, ఎల్లోమీడియా చేస్తున్నవే. లిక్కర్ లో వేలకోట్లు దోచుకున్నాడని, ఇసుక, గంజాయిలో వేల కోట్లు దోచుకున్నాడనే రాజకీయ ఆరోపణలు తప్ప ఆధారాలు ఏమీలేవు. జగన్ పైన అభిప్రాయాలు వ్యక్తంచేసిన సుజనా కూడా మొన్నటివరకు చంద్రబాబు అండ్ కో తో గొంతు కలిపిన వ్యక్తే.jagan sujana modi{#}Jagan;Congress;Sujana Choudary;Reddy;Criminal;ram pothineni;Telangana Chief Minister;CBI;CBN;courtఅమరావతి : జగన్ కు సుజనా సర్టిఫికేట్ ?..ఆశ్చర్యంగా ఉందేఅమరావతి : జగన్ కు సుజనా సర్టిఫికేట్ ?..ఆశ్చర్యంగా ఉందేjagan sujana modi{#}Jagan;Congress;Sujana Choudary;Reddy;Criminal;ram pothineni;Telangana Chief Minister;CBI;CBN;courtTue, 10 Oct 2023 07:00:00 GMT


కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి యూటర్న్ తీసుకున్నట్లే ఉన్నారు. అదికూడా ఎల్లోమీడియా అధిపతి ఛానల్ ఇంటర్వ్యూలోనే. ఇంతకీ విషయం ఏమిటంటే ఛానల్ అధిపతి ఇంటర్వ్యూలో సుజనా మాట్లాడుతు ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవన్నారు. ‘వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దాన్ని మిస్ యూజ్ చేసి గనుక బెనిఫిట్ పొందితే అప్పటికున్న ఇన్ కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం 30 శాతం ట్యాక్స్ కట్టేస్తే మిగిలిన 70 శాతం అడగరు’.





‘డబ్బుపోయిన వాళ్ళు కంప్లైంట్ చేస్తే అదివేరే క్రిమినల్ కేసు. ఆ పరిస్ధితుల్లో కోర్టు ఆదేశిస్తే సీబీఐ మొదలుపెడుతుంది. కాబట్టి దానికి యాంటీ కరెప్షన్ కు సంబంధంలేదు’. ఇది జగన్ విషయమై సుజనా వ్యక్తంచేసిన అభిప్రాయాలు. అంటే సుజనా చెప్పింది ఏమిటంటే జగన్ అవినీతిపరుడు కాదని. తనపై నమోదైన కేసులు, విచారణ అంతా రాజకీయ ప్రేరేపితమని చెప్పకనే చెప్పినట్లుంది. తండ్రిని అడ్డంపెట్టుకుని జగన్ రు. లక్ష కోట్లు దోచుకున్నారని, రు. 43 వేల కోట్లు దోచుకున్నారని చంద్రబాబు అండ్ కో చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలే అని సుజనా చెప్పినట్లయ్యింది.




విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్ అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లేవు. చేస్తున్న ఆరోపణలన్నీ చంద్రబాబునాయుడు, లోకేష్, తమ్ముళ్ళు, ఎల్లోమీడియా చేస్తున్నవే. లిక్కర్ లో వేలకోట్లు దోచుకున్నాడని, ఇసుక, గంజాయిలో వేల కోట్లు దోచుకున్నాడనే రాజకీయ ఆరోపణలు తప్ప ఆధారాలు ఏమీలేవు. జగన్ పైన అభిప్రాయాలు వ్యక్తంచేసిన సుజనా కూడా మొన్నటివరకు చంద్రబాబు అండ్ కో తో గొంతు కలిపిన వ్యక్తే.





ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే సుజనా మాటలను ఇంటర్వ్యూచేసిన ఎల్లోమీడియా అధిపతి కూడా ఖండించలేదు. ప్రతిరోజు జగన్ పైన టన్నుల కొద్ది బురదను చల్లేస్తున్న ఈ అధిపతి కూడా సుజనా వ్యాఖ్యలతో ఏకీభవించినట్లే ఉంది. ఒకపుడు కాంగ్రెస్ లో చక్రంతిప్పిన గులాంనబీఆజాద్, జై రామ్ రమేష్ లాంటి వాళ్ళు జగన్ పై నమోదైన కేసులన్నీ రాజకీయప్రేరేపితమేనని చెప్పిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లోనే ఉండుంటే జగన్ పైన  కేసులు ఉండేవికావని మీడియాతో చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇపుడు సుజనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంత్రి రోజాకి ప్రపోజ్ చేసి.. సెల్వమణి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>