Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socilastars-lifestyle6efb0023-23fa-433d-bc15-36100a02fe98-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socilastars-lifestyle6efb0023-23fa-433d-bc15-36100a02fe98-415x250-IndiaHerald.jpgఒక భాషలో విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించిన సినిమాను మరొక భాషలో రీమేక్ చేయడం అన్నది ఎప్పటినుంచో వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో రీమేక్ సినిమాల ట్రెండ్ బాగా పెరిగిపోయింది.గతంలో మన తెలుగు సినిమాలు తమిళ్ లో, తమిళ్ సినిమాలు తెలుగులో ఎక్కువగా రీమేక్ అయ్యేవి. సినిమాలతో పాటు సాంగ్స్, మ్యూజిక్ కూడా గతంలో చాలానే రీమేక్ చేయడం లేదా కాపీ కొట్టడం చేసేవాళ్ళు. తమిళ్ స్టార్ హీరో విజయ్ అయితే అతని కెరీర్ లో దాదాపు సగం సినిమాలు తెలుగు రీమేక్ లే చేశారు.కేవలం సినిమాలే కాకుండా అందులో సాంగ్స్, డ్యాన్సులు, పాటలుsocilastars lifestyle{#}indra;jyothika;raghava lawrence;Chiranjeevi;Remake;Joseph Vijay;Master;Tamil;Yevaru;Success;Hero;Cinema;Teluguమెగాస్టార్ స్టెప్ ను కాపీ చేసిన కోలీవుడ్ హీరో...!!మెగాస్టార్ స్టెప్ ను కాపీ చేసిన కోలీవుడ్ హీరో...!!socilastars lifestyle{#}indra;jyothika;raghava lawrence;Chiranjeevi;Remake;Joseph Vijay;Master;Tamil;Yevaru;Success;Hero;Cinema;TeluguMon, 09 Oct 2023 06:53:00 GMTఒక భాషలో విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించిన సినిమాను మరొక భాషలో రీమేక్ చేయడం అన్నది ఎప్పటినుంచో వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో రీమేక్ సినిమాల ట్రెండ్ బాగా పెరిగిపోయింది.గతంలో మన తెలుగు సినిమాలు తమిళ్ లో, తమిళ్ సినిమాలు తెలుగులో ఎక్కువగా రీమేక్ అయ్యేవి. సినిమాలతో పాటు సాంగ్స్, మ్యూజిక్ కూడా గతంలో చాలానే రీమేక్ చేయడం లేదా కాపీ కొట్టడం చేసేవాళ్ళు. తమిళ్ స్టార్ హీరో విజయ్ అయితే అతని కెరీర్ లో దాదాపు సగం సినిమాలు తెలుగు రీమేక్ లే చేశారు.కేవలం సినిమాలే కాకుండా అందులో సాంగ్స్, డ్యాన్సులు, పాటలు కూడా రీమేక్ చేసేవాళ్ళు. మన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఇంద్ర సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే.

ముఖ్యంగా ఈ సినిమాలో దాయి దాయి దామ్మా సాంగ్ లో వచ్చే వీణ స్టెప్ కూడా బాగా పాపులర్ అయింది. సినిమా విడుదల అయినా తర్వాత కొంతకాలం ఎక్కడ చూసినా కూడా ఈ పాట వినిపించడంతో పాటు ఎవరు చూసినా ఈ స్టెప్పుకు డాన్సులు వేశారు. ఇప్పటికీ ఈ పాట ఎక్కడైనా వినిపిస్తే చాలు వెంటనే మనకు మైండ్ లో వీణ స్టెప్ గుర్తుకు వస్తుంది.  అయితే ఆ వీణ స్టెప్ కూడా తమిళ్ హీరో విజయ్ ఓ సినిమాలో కాపీ కొట్టారు. ఇంద్ర సినిమా 2002లో రాగా విజయ్ 2003లో తిరుమలై అనే ఒక సినిమాతో వచ్చారు.

ఈ సినిమాలో జ్యోతిక హీరోయిన్ గా నటించింది. తిరుమలై సినిమాలో తంతకా ధీంతక.. అనే ఒక సాంగ్ ఉంది. ఈ పాటలో విజయ్ చిరంజీవి వేసిన వీణ స్టెప్ వేస్తాడు.పాట మొత్తం డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ కూడా ఉంటాడు. లారెన్స్ కూడా విజయ్ తో కలిసి వీణ స్టెప్ వేస్తాడు. అయితే ఇంద్ర సినిమాలో చిరంజీవితో వీణ స్టెప్ వేయించింది కూడా లారెన్సే. అయితే ఇప్పుడు విజయ్ వీణ స్టెప్ వైరల్ అవుతుండటంత బాస్ చేస్తే స్టెప్ లో గ్రేస్ ఉంటుంది. విజయ్ ఏదో డ్యాన్స్ వేయాలని వేసాడు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సందర్భంగా నితిన్... వెంకీ కుడుముల కాంబో మూవీ టైటిల్ అనౌన్స్మెంట్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>