MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbcb30b33-6e47-4c03-ba53-93e88ec86d11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbcb30b33-6e47-4c03-ba53-93e88ec86d11-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో పలు రకాల సినిమాలు చేసి హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకుంది భూమి పెడ్నేకర్. సినిమాల్లోనే కాకుండా కొన్ని వెబ్ సిరీస్ ల్లో సైతం నటించింది. అయితే తాజాగా తనపై సోషల్ మీడియాలో వస్తున్న పలు రకాల ట్రోల్స్ పై స్పందించింది. దీంతో భూమి పెడ్నేకర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తొలి సినిమాలోనే చాలా లావుగా కనిపించి ప్రయోగాత్మక పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకొని బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించింది. ఆ తర్వాత రొటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ రోల్స్ ఎంచుకొని బీటౌన్ లో వరుస సినిమాలు tollywood{#}Bhumi Pednekar;bollywood;Cinema;Manamఈ రోజుల్లో అవి సర్వసాధారణమే,ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన భూమి పెడ్నేకర్!ఈ రోజుల్లో అవి సర్వసాధారణమే,ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన భూమి పెడ్నేకర్!tollywood{#}Bhumi Pednekar;bollywood;Cinema;ManamMon, 09 Oct 2023 15:11:33 GMTబాలీవుడ్ లో పలు రకాల సినిమాలు చేసి హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకుంది భూమి పెడ్నేకర్. సినిమాల్లోనే కాకుండా కొన్ని వెబ్ సిరీస్ ల్లో సైతం నటించింది. అయితే తాజాగా తనపై సోషల్ మీడియాలో వస్తున్న పలు రకాల ట్రోల్స్ పై స్పందించింది. దీంతో భూమి పెడ్నేకర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తొలి సినిమాలోనే చాలా లావుగా కనిపించి ప్రయోగాత్మక పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకొని బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించింది. ఆ తర్వాత రొటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ రోల్స్ ఎంచుకొని బీటౌన్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయింది.  ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాల్లో నటించి అభిమానులను అలరించింది. 

త్వరలోనే 'థాంక్యూ ఫర్ కమింగ్' అనే బోల్డ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న భూమి పెడ్నేకర్ సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్లింగ్స్ స్పందించింది. నటీనటులపై అసభ్యకర కామెంట్లు చేయడానికి ఓ వర్గానికి చెందిన నేటిజన్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని తన ఆవేదన వ్యక్తపరిచింది. "ఈరోజుల్లో ట్రోలింగ్ అనేది సర్వసాధారణమైపోయింది. మనం ఏం చేసినా జనాలు మనల్ని ట్రోల్ చేస్తుంటారు. పండగ రోజుల్లో నేను సంప్రదాయ దుస్తులు ధరించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినా విమర్శిస్తారు. సినిమా ప్రమోషన్ సమయంలో కనిపించకపోయినా కనిపించడం లేదని అంటారు. 

ఇంతకుముందు మన దుస్తుల గురించి ఇంట్లో వాళ్ళు మాత్రమే మాట్లాడేవారు. ఇప్పుడు వాటి గురించి అందరూ అడగడం మొదలుపెట్టారు. ఇది నా డ్రెస్సింగ్ పై చిన్నప్పటి నుంచి నేను విమర్శలు ఎదుర్కొన్నాను. 'పొట్టి దుస్తులు ఎందుకు వేసుకుంటున్నావ్' అని నన్ను చాలామంది ప్రశ్నించే. వాళ్ళు అలా నన్ను ట్రోల్ చేసే వాళ్లే మళ్ళీ సంస్కృతిని కాపాడాలని మాట్లాడతారు. కానీ మన గురించి అభిప్రాయాలు పంచుకునేందుకు అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తూ ఉంటారు. స్త్రీలను గౌరవించడం, వారితో మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం అనేది మన సంస్కృతిలోనే ఉంది. కానీ వాళ్లు మాట్లాడే విధానం చాలా అసభ్యకరంగా ఉంటుంది. ఒక్కోసారి వాటిని చదవాలన్నా చాలా ధైర్యం కావాలి. అందుకే అటువంటి ట్రోల్స్ ను నేను ఏమాత్రం పట్టించుకోను" అంటూ చెప్పుకొచ్చింది భూమి పెడ్నేకర్. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రజిని171: షూటింగ్ అప్పుడే.. మూవీ నెక్స్ట్ లేవలట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>