PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/will-palestine-eradicate-from-world-map041ee296-65ab-4ffe-bf07-768a56158404-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/will-palestine-eradicate-from-world-map041ee296-65ab-4ffe-bf07-768a56158404-415x250-IndiaHerald.jpgఏమాత్రం ఊహించని దాడులతో ముందు ఇజ్రాయేల్ షాక్ కు గురై వెంటనే కోలుకుని ఎదురుదాడులు మొదలుపెట్టింది. మొదలుపెట్టడమే దాడులు కాకుండా ఏకంగా యుద్ధం మొదలుపెట్టేసింది. పాలస్ధీనాలోని నగరాలు, పట్టణాలపై ఇజ్రాయేల్ విచక్షణా రహితంగా బాంబులు, మిస్సయిల్స్ ప్రయోగిస్తోంది. దానిదెబ్బకు జనాలు ఇళ్ళల్లో ఉండలేక రోడ్లపైకి రాలేక నానా అవస్తలు పడుతున్నారు.palistene israel war{#}festival;Bank;East;Saturday;Israel;warఢిల్లీ : పాలస్తీనా తుడిచిపెట్టుకుపోతుందా ?ఢిల్లీ : పాలస్తీనా తుడిచిపెట్టుకుపోతుందా ?palistene israel war{#}festival;Bank;East;Saturday;Israel;warMon, 09 Oct 2023 03:00:00 GMT

తొందరలోనే ప్రపంచపఠం నుండి పాలస్తీనా దేశం మాయమైపోతుందా ? ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం సడెన్ గా ఇజ్రాయెల్ దళాలు పాలస్తీనా మీద బాంబులు, మిస్సయిళ్ళతో దాడులు మొదలుపెట్టింది. ఈ దాడుల్లో పాలస్తీనాలోని కొన్ని పట్టణాల్లోని ప్రాంతాలు నేలమట్టమైపోయాయి. ఎంతమంది చనిపోయారు ? ఎన్ని వేలమంది గాయపడ్డారనే విషయాలు ప్రపంచానికి తెలీటంలేదు. యుద్ధం ప్రారంభమైన 20 నిముషాల్లో ఇజ్రాయేల్ 5 వేల మిస్సయిళ్ళు, బాంబులను పాలస్తీనా మీద ప్రయోగించిందంటేనే యుద్ధం ఏ స్ధాయిలో జరుగుతోందో అర్ధమైపోతోంది.




అసలు సడెన్ గా ఇజ్రాయేల్ ఎందుకు యుద్ధం మొదలుపెట్టింది ? ఎందుకంటే పాలస్ధీనాలోని హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయేల్ మీద రాకెట్లు ప్రయోగించారు. ఇజ్రాయేల్-పాలస్ధీనా మధ్య దశాబ్దాలుగా యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.  పండుగ సందర్భంగా ఆదమరచి ఉన్న ఇజ్రాయేల్ మీదకు హమాస్ మిలిటెంట్లు సడెన్ గా చేసిన దాడుల్లో 500 మంది ఇజ్రాయేల్ పౌరులు చనిపోగా కొన్ని వందల మంది సీరియస్ గా గాయపడ్డారు. వందల సంఖ్యలో భవనాలు కూలిపోయాయి.




ఏమాత్రం ఊహించని దాడులతో ముందు ఇజ్రాయేల్ షాక్ కు గురై వెంటనే కోలుకుని ఎదురుదాడులు మొదలుపెట్టింది. మొదలుపెట్టడమే దాడులు కాకుండా ఏకంగా యుద్ధం మొదలుపెట్టేసింది.  పాలస్ధీనాలోని నగరాలు, పట్టణాలపై ఇజ్రాయేల్ విచక్షణా రహితంగా బాంబులు, మిస్సయిల్స్ ప్రయోగిస్తోంది. దానిదెబ్బకు జనాలు ఇళ్ళల్లో ఉండలేక రోడ్లపైకి రాలేక నానా అవస్తలు పడుతున్నారు.




రాజధాని జెరూసలేం విషయంలోనే పాలస్తీనా-ఇజ్రాయేల్ మధ్య వందేళ్ళుగా యుద్ధాలు జరుగుతున్నది. జెరూసలేం మొత్తాన్ని తన రాజధానిగా ఇజ్రాయేల్ ప్రకటించుకుంటే తూర్పు జెరూసలేంను తమరాజధానిగా పాలస్తీనా ప్రకటించుకుంది. అంటే జెరూసలేం కోసమే రెండుదేశాల మధ్య యుద్ధం జరుగుతోందన్నది స్పష్టం. ఈ విషయంలో ప్రపంచదేశాలు కూడా ఏమీ చేయలేకపోయాయి. రెండుదేశాల్లోని గాజా, వెస్ట్ బ్యాంక్ లాంటి కొన్ని ప్రాంతాలు రెండు దేశాలు ఆక్రమించుకున్నాయి. ఇపుడు మొదలైన యుద్ధం చూస్తుంటే పాలస్తీనాని ప్రపచంపఠం నుండి తొలగించాలనే ఇజ్రాయేల్ సిద్ధమైపోయిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : పవన్ మీద ఆరోపణలు నిజమేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>