LifeStyleChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/jaganf78a8fd0-a072-46d1-a678-e02ca735d95f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/jaganf78a8fd0-a072-46d1-a678-e02ca735d95f-415x250-IndiaHerald.jpgకల్తీ ఆహార పదార్థాలను కనిపెట్టే వాహనాలను ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చారు. ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ కు అనే వాహనాలు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దుకాణాల్లో, హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో ఆహార పదార్థాలను సేకరించి అవి నాణ్యతతో కూడినవా లేదా అనే టెస్టులు చేస్తారు. దీనికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ అనే వాహానాలను ఆంధ్రప్రదేశ్ సర్కారు త్వరలోనే తీసుకురానుంది. వీటి ద్వారా ఎప్పటికప్పుడు ఆహార కల్తీలను కనిపెట్టవచ్చు. రెండు దశల్లో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ లను తీసుకురానుంది. తొలిదశలో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంjagan{#}Cholesterol;Tirupati;vehicles;Andhra Pradesh;Governmentభలే.. ఇక కల్తీని అక్కడికక్కడే కనిపెట్టేస్తారు?భలే.. ఇక కల్తీని అక్కడికక్కడే కనిపెట్టేస్తారు?jagan{#}Cholesterol;Tirupati;vehicles;Andhra Pradesh;GovernmentMon, 09 Oct 2023 08:00:00 GMTకల్తీ ఆహార పదార్థాలను కనిపెట్టే వాహనాలను ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చారు. ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ కు అనే వాహనాలు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దుకాణాల్లో, హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో ఆహార పదార్థాలను సేకరించి అవి నాణ్యతతో కూడినవా లేదా అనే టెస్టులు చేస్తారు. దీనికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ అనే వాహానాలను ఆంధ్ర ప్రదేశ్ సర్కారు త్వరలోనే తీసుకురానుంది.


వీటి ద్వారా ఎప్పటికప్పుడు ఆహార కల్తీలను కనిపెట్టవచ్చు. రెండు దశల్లో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ లను తీసుకురానుంది. తొలిదశలో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి సిటీల్లో ప్రవేశపెట్టనున్నారు. తొలిదశలో నాలుగు వాహనాలను ఈ ప్రధాన నగరాల్లో ప్రవేశపెట్టి అక్కడ ఫుడ్ సెఫ్టీకి సంబంధించిన పరీక్షలు చేస్తారు. తదనంతరం రాష్ట్ర వ్యాప్తం ఈ వాహనాలను మొత్తం 14 కొననున్నారు.


రెండు దశల్లో 14 వాహనాలు అందుబాటులోకి వచ్చాక ఉమ్మడి పాత జిల్లాల ప్రాతిపదికన ఒక్కొక్క వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒక్కో వాహనం కొనుగోలుకు ప్రభుత్వం దాదాపు రూ. 10 లక్షలు ఖర్చు పెట్టనుంది.  ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలఫ్మెంట్ ఏపీ ఎంఎస్డీసీ టెండర్లను ఆహ్వానిస్తుంది. పాల కల్తీని నివారించడానికి యూరియా, సర్ఫ్, డిజార్టెంట్ పౌడర్ లు కలిపారా? లేదా అనే పరీక్షలు కూడా ఇందులో చేయొచ్చు.


అదే విధంగా ఇందులో దాదాపు మొత్తం 80 రకాల టెస్టులు చేస్తారు.  పాలల్లో కొవ్వు శాతాన్ని తెలుసుకుంటారు. ఫుడ్ కలర్స్ ఆనవాళ్లు కనిపెట్టడం, హోటళ్లలో వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడుతున్నారా అనే కోణాల్లో తదితర వివరాలు తెలుస్తాయి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన విషయాల్లో అనేక రకాల పరీక్షలు చేసి నాణ్యత తీరును కనిపెట్టి ఆయా హోటళ్లు, రెస్టారెంట్ల పని తీరును కనుగొని అత్యంత రక్షణతో నాణ్యతతో కూడిన ఫుడ్  సఫ్లై విధానాన్ని తీసుకొచ్చి.. కల్తీని అరికట్టవచ్చని తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సందర్భంగా నితిన్... వెంకీ కుడుముల కాంబో మూవీ టైటిల్ అనౌన్స్మెంట్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>