DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawan06647a77-b1b8-4844-a93f-0489246f50d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawan06647a77-b1b8-4844-a93f-0489246f50d5-415x250-IndiaHerald.jpgసినిమా వాళ్లను రాజకీయ నాయకులు టార్గెట్ చేసుకుని మరి మాట్లాడుతున్నారు. కానీ సినిమా వాళ్లు రాజకీయ నాయకులను ఎందుకు భయపడాలని పవన్ కల్యాణ్ అంటున్నారు. వైసీపీ నాయకులు ఇష్టారీతిన సినిమా రంగానికి చెందిన సెలబ్రెటీలపై వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అయితే వైసీపీ నాయకులు మాట్లాడిన తీరుపై ప్రశ్నించిన పవన్ కల్యాణ్ మంత్రి రోజాపై మాట్లాడిన తీరుపై ఎందుకు ఖండించలేదు. గతంలో రాఘవేంద్రరావు, కేఎస్ రామారావు, ఆశ్వనీదత్ లాంటి వారు కూడా అనేక సార్లు విమర్శించిన దాఖలాలు ఉన్నాయి. అయితే కేవలం ఆంధ్రలో ఉన్న రాజకీయ నాయPAWAN{#}ramya krishnan;Pawan Kalyan;Janasena;YCP;Andhra Pradesh;Cinema;Minister;TDPరోజాపై వ్యాఖ్యలు.. పవన్‌ స్పందించరేం?రోజాపై వ్యాఖ్యలు.. పవన్‌ స్పందించరేం?PAWAN{#}ramya krishnan;Pawan Kalyan;Janasena;YCP;Andhra Pradesh;Cinema;Minister;TDPMon, 09 Oct 2023 05:00:00 GMTసినిమా వాళ్లను రాజకీయ నాయకులు టార్గెట్ చేసుకుని మరి మాట్లాడుతున్నారు. కానీ సినిమా వాళ్లు రాజకీయ నాయకులను ఎందుకు భయపడాలని పవన్ కల్యాణ్ అంటున్నారు. వైసీపీ నాయకులు ఇష్టారీతిన సినిమా రంగానికి చెందిన సెలబ్రెటీలపై వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అయితే వైసీపీ నాయకులు మాట్లాడిన తీరుపై ప్రశ్నించిన పవన్ కల్యాణ్ మంత్రి రోజాపై మాట్లాడిన తీరుపై ఎందుకు ఖండించలేదు.


గతంలో రాఘవేంద్రరావు, కేఎస్ రామారావు, ఆశ్వనీదత్ లాంటి వారు కూడా అనేక సార్లు విమర్శించిన దాఖలాలు ఉన్నాయి. అయితే కేవలం ఆంధ్రలో ఉన్న రాజకీయ నాయకులను మాత్రమే విమర్శిస్తూ తెలంగాణలో ఎవరూ ఎమీ అన్నా కూడా మాట్లాడకుండా ఉంటున్నారు. మంత్రి రోజాపై టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాధిక, రమ్య కృష్ణ లాంటి స్పందించి బండారు వ్యాఖ్యల్ని ఖండించారు.


కానీ ఆ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు జనసేన అధినేత కానీ టీడీపీ అధినేత గానీ ఎవరూ స్పందించలేరు. ఇలాంటి సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమా రంగానికి చెందిన వ్యక్తి అయినటువంటి రోజాపై ఘాటు విమర్శలు చేసిన వ్యక్తి గురించి ఎందుకు విమర్శలు చేయలేదు. ఇలాంటి మాటలు తన కుటుంబానికి చెందిన వ్యక్తులను అంటే ఊరుకుంటారా? కాబట్టి పవన్ కల్యాణ్ తన వరకు వస్తే ఒకలా ఇంకొకరికి జరిగితే మరోలా స్పందించడం అనేది మానుకోవాలి.


రాజకీయ విమర్శలు ఎన్ని చేసినా పర్లేదు. కానీ వ్యక్తిత హననం అనేది దారుణమైన అంశం. కాబట్టి మహిళలు రాజకీయాల్లో రాణించాలని అనుకుంటున్న తరుణంలో ఒక మహిళా మంత్రిపై వ్యక్తిగత  జీవితంపై ఆరోపణలు చేయడం సభ్యసమాజం తలదించుకోవాల్సిన విషయం. కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే సినిమా రంగం వారిపై ఇలా ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తున్న కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణమైన విషయం ఇలాంటి విషయాలపై పవన్ కల్యాణ్ స్పందిచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : పవన్ మీద ఆరోపణలు నిజమేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>