MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf36f6dac-7eb9-452b-afb8-561cf4b98e03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf36f6dac-7eb9-452b-afb8-561cf4b98e03-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అయితే తాజాగా గురువారం ఆయన హీరోగా నటిస్తున్న లియో సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. థియేటర్స్ లో లియో ట్రైలర్ ని ప్రదర్శించారు. ఆ ట్రైలర్ ని చూసేందుకు వచ్చిన అభిమానులు థియేటర్లోని సీట్లను చింపి, కుర్చీలను విరగొట్టేసారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లియో'(Leo). లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న tollywood{#}Lokesh;rohini;Telugu;cinema theater;thursday;Chennai;Thriller;Hero;Joseph Vijay;Lokesh Kanagaraj;Cinema'లియో' ట్రైలర్ థియేటర్ ని ధ్వంసం చేసిన ఫ్యాన్స్!'లియో' ట్రైలర్ థియేటర్ ని ధ్వంసం చేసిన ఫ్యాన్స్!tollywood{#}Lokesh;rohini;Telugu;cinema theater;thursday;Chennai;Thriller;Hero;Joseph Vijay;Lokesh Kanagaraj;CinemaMon, 09 Oct 2023 15:20:26 GMTహీరో దళపతి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అయితే తాజాగా గురువారం ఆయన హీరోగా నటిస్తున్న లియో సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. థియేటర్స్ లో లియో ట్రైలర్ ని ప్రదర్శించారు. ఆ ట్రైలర్ ని చూసేందుకు వచ్చిన అభిమానులు థియేటర్లోని సీట్లను చింపి, కుర్చీలను విరగొట్టేసారు.  ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లియో'(Leo). లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ఇదిలా ఉంటే 'లియో' ట్రైలర్ ని చెన్నై లోని రోహిణి థియేటర్లో ప్రదర్శించారు. దీంతో ట్రైలర్ చూసేందుకు వందలాది మంది అభిమానులు థియేటర్ కి చేరుకున్నారు. ట్రైలర్ చూసే ఉత్సాహంతో అభిమానులు థియేటర్స్ లో సీట్లు చింపి చెల్లాచెదులు చేశారు. కుర్చీలను విసురుతూ నానా హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన మరో వీడియోని ఓ నెటిజన్ తన సోషల్ మీడియాలో పంచుకుంటూ..' ఫ్యాన్స్ ఇది కావాలని చేసిన పని కాదని, థియేటర్ యాజమాన్యం చేసిన తప్పు వల్లే ఇలా జరిగిందని' రాస్కొచ్చాడు. ఏదేమైనా థియేటర్లో విజయ్ ఫ్యాన్స్ సృష్టించిన బీభత్సం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

 రీసెంట్ టైమ్స్ లో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొందరు అగ్ర హీరోల ఫ్యాన్స్ ఇలాంటి పనులు చేయడంతో థియేటర్ యాజమాన్యం అప్రమత్తమై ఇలాంటి స్టంట్స్ జరిగే సమయంలో భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇక 'లియో' ట్రైలర్ విషయానికొస్తే.. " సీరియల్ కిల్లర్ నడి రోడ్డు మీద గుడ్డిగా షూట్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా మంది చనిపోయారు.. వాడు అందరినీ కలుస్తున్నాడు’’ అనే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత లోకేష్ ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ సీన్స్ తోనే నింపేశాడు. దీన్నిబట్టి ఇది లోకేష్ కనగరాజ్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఓవైపు యాక్షన్ ని హైలెట్ చేస్తూనే మరోవైపు సినిమా కథేంటి అనే దాన్ని కూడా ట్రైలర్ లో చెప్పే ప్రయత్నం ఆకట్టుకుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రజిని171: షూటింగ్ అప్పుడే.. మూవీ నెక్స్ట్ లేవలట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>