EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/inter5b69e23a-f304-40a3-99f5-695f88b01516-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/inter5b69e23a-f304-40a3-99f5-695f88b01516-415x250-IndiaHerald.jpgఇంటర్ విద్యార్థుల జీవితాలతో ఏపీ ప్రభుత్వం ఆటలు ఆడుతోంది. ఇంటర్ చదివే విద్యార్థులకు వారు పాసైన తర్వాత డిగ్రీకి వెళ్లే సమయంలో వర్జినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు. దీనిపై ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం ప్రచురించింది. అయితే ఇంటర్మీడియట్ కు సంబంధించిన ఒక అధికారి న్యూఢిల్లీలో ఉంటారని ఆయన వారానికి రెండు రోజులు మాత్రమే ఇక్కడికి వస్తారని మిగతా సమయం అక్కడే ఉండి ఆన్ లైన్ లో డ్యూటీ చేస్తారని చెప్పుకొచ్చింది. పర్యవేక్షణ లేక మార్కుల లిస్టు టైంకు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నాINTER{#}students;Qualification;Kathanam;Janasena;Pawan Kalyan;Andhra Pradesh;Governmentఇంటర్ విద్యార్థులతో ఆటలేంటి జగన్‌ సారూ?ఇంటర్ విద్యార్థులతో ఆటలేంటి జగన్‌ సారూ?INTER{#}students;Qualification;Kathanam;Janasena;Pawan Kalyan;Andhra Pradesh;GovernmentMon, 09 Oct 2023 10:00:00 GMTఇంటర్ విద్యార్థుల జీవితాలతో ఏపీ ప్రభుత్వం ఆటలు ఆడుతోంది. ఇంటర్ చదివే విద్యార్థులకు వారు పాసైన తర్వాత డిగ్రీకి వెళ్లే సమయంలో వర్జినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు. దీనిపై ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం ప్రచురించింది. అయితే ఇంటర్మీడియట్ కు సంబంధించిన ఒక అధికారి న్యూఢిల్లీలో ఉంటారని ఆయన వారానికి రెండు రోజులు మాత్రమే ఇక్కడికి వస్తారని మిగతా సమయం అక్కడే ఉండి ఆన్ లైన్ లో డ్యూటీ చేస్తారని చెప్పుకొచ్చింది.


పర్యవేక్షణ లేక మార్కుల లిస్టు టైంకు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్మీడియట్ విభాగానికి సంబంధించి ఇంత నిర్లక్ష్యంగా ఉంటే సంక్షేమం విషయంలో ఎలా ఉంటారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఫెయిల్ అయిన విద్యార్థులను తిరిగి కాలేజీల్లో చేర్చుకునే విధానాన్ని ఇంటర్ లో కొత్తగా చేర్చారు. ఫెయిల్ అయినా విద్యార్థులు మళ్లీ అన్ని సబ్జెక్టులు రాయాల్సి ఉంటుందని ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి సౌరబ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


రీ జాయిన్ అయినా విద్యార్థులకు రెగ్యూలర్ విద్యార్థుల తరహాలో సర్టిఫికెట్లు అందిస్తామని ఆయన తెలిపారు. పాసైన సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చిన దాన్నే పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పారు. రీ అడ్మిషన్ పొంది ఉత్తీర్ణులైన విద్యార్థులను సర్టిఫికెట్లు జారీ చేస్తామని చెప్పారు. 2014 నుంచి 22 వరకు ఉత్తీర్ణులైన ఇంటర్ విద్యార్థుల సర్టిఫికెట్లు డీజీ లాకర్ లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మైగ్రేషన్ సర్టిఫికెట్లు, అర్హత లు కూడా అన్ని దాంట్లో ఉంటాయని పేర్కొన్నారు.


అయితే దీనిపై ఇంటర్ విద్యార్థులకు కలుగుతున్న అసౌకర్యాల గురించి ప్రభుత్వం పట్టించుకుని సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా చేయడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించవచ్చు. అలాగే పూర్తిస్థాయిలో ఇక్కడే ఉండే అధికారులను నియమించడం వల్ల అనేక రకాల సమస్యలను పరిష్కరించవచ్చు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సందర్భంగా నితిన్... వెంకీ కుడుముల కాంబో మూవీ టైటిల్ అనౌన్స్మెంట్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>