PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawan-dwarampudi-4b513394-174f-473b-8270-11ae8f5558b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawan-dwarampudi-4b513394-174f-473b-8270-11ae8f5558b7-415x250-IndiaHerald.jpgఅలాంటిది పవన్ పై ద్వారంపూడి ఇంతపెద్ద ఆరోపణలు చేసినా ఎవరూ ఇంతవరకు ఎందుకని నోరిప్పలేదు ? ఖండించలేదు ? అంటే పవన్ విషయంలో ద్వారంపూడి చేసిన ఆరోపణలు నిజమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే టీడీపీ నేతలు కూడా మాట్లాడటంలేదు. పవన్ ప్యాకేజీలు తీసుకుంటున్నది చంద్రబాబునాయుడు దగ్గరే అని జగన్మోహన్ రెడ్డి అండ్ కో పదేపదే ఆరోపిస్తున్నారు. మరి తాజా ఆరోపణలపై ఇటు జనసేన అటు టీడీపీ రెండుపార్టీల్లోను ఎలాంటి సౌండ్ వినిపించటంలేదు ? రెండుపార్టీల నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నట్లు ?janasena pawan dwarampudi {#}Singapore;Janasena;MLA;salt;TDP;kakinada;Reddy;Yevaru;Pawan Kalyan;Party;Mumbai;Bharatiya Janata Party;Government;Newsఅమరావతి : పవన్ మీద ఆరోపణలు నిజమేనా ?అమరావతి : పవన్ మీద ఆరోపణలు నిజమేనా ?janasena pawan dwarampudi {#}Singapore;Janasena;MLA;salt;TDP;kakinada;Reddy;Yevaru;Pawan Kalyan;Party;Mumbai;Bharatiya Janata Party;Government;NewsMon, 09 Oct 2023 05:00:00 GMT


జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాకినాడ వైసీపీ ఎంఎల్ఏ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడుతు పవన్ అందుకున్న ప్యాకేజీ మొత్తం రు. 1400 కోట్లని ఆరోపించారు. తాను అందుకున్న ప్యాకేజీ డబ్బును పవన్ రష్యా, దుబాయ్, సింగపూర్ కు పంపేసినట్లు చెప్పారు. పవన్ అందుకున్న ప్యాకేజీ వివరాలు, విదేశాలకు పంపేసిన వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని ఎంఎల్ఏ పెద్ద బాంబే పేల్చారు.





బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పవన్ బండారమంతా బయటపడుతుందన్నారు. ఈ విషయంలోనే  బీజేపీ అంటే పవన్ భయపడుతున్నట్లు కూడా ద్వారంపూడి చెప్పారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ద్వారంపూడి-పవన్ మధ్య వ్యవహారం ఉప్పు నిప్పులాగుంటుంది. ఇద్దరు ఒకళ్ళని మరొకళ్ళు తీవ్రంగా దూషించుకున్న, వార్నింగులిచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటివరకు పవన్ను ఎంఎల్ఏ ప్యాకేజీ స్టార్ అనే అంటున్నారు. అయితే తాజాగా మాత్రం ప్యాకేజీ మొత్తం, విదేశాలకు తరలిపోవటం, సమాచారం ప్రభుత్వం దగ్గరుంది అని చెప్పటమే ఇంట్రెస్టింగ్ పాయింట్.





అయితే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే పవన్ పై  ద్వారంపూడి ఆరోపణలు చేసి నాలుగురోజులు అయినా ఇప్పటివరకు ఎవరు నోరిప్పలేదు. పవన్ లేదా జనసేనలో ఏ నేత కూడా ద్వారంపూడి ఆరోపణలు తప్పని చెప్పలేదు. పవన్ పై ఎవరైనా ఒక్కమాటన్నా పార్టీ నేతలు సహించరు. వెంటనే ఖండనలు, ప్రత్యారోపణలతో రెచ్చిపోతుంటారు.





అలాంటిది పవన్ పై ద్వారంపూడి ఇంతపెద్ద ఆరోపణలు చేసినా ఎవరూ ఇంతవరకు ఎందుకని నోరిప్పలేదు ? ఖండించలేదు ? అంటే పవన్ విషయంలో ద్వారంపూడి చేసిన ఆరోపణలు నిజమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే టీడీపీ నేతలు కూడా మాట్లాడటంలేదు. పవన్ ప్యాకేజీలు తీసుకుంటున్నది చంద్రబాబునాయుడు దగ్గరే అని జగన్మోహన్ రెడ్డి అండ్ కో పదేపదే ఆరోపిస్తున్నారు. మరి తాజా ఆరోపణలపై ఇటు జనసేన అటు టీడీపీ రెండుపార్టీల్లోను ఎలాంటి సౌండ్ వినిపించటంలేదు ? రెండుపార్టీల నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నట్లు ?




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : పవన్ మీద ఆరోపణలు నిజమేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>