HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/hair-tips491561e7-eff2-4357-9e05-675c7fcf699d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/hair-tips491561e7-eff2-4357-9e05-675c7fcf699d-415x250-IndiaHerald.jpgజుట్టు అందంగా, పట్టుకుచ్చులా మెరవాలని ఇంకా మృదువగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం చాలా రకాల షాంపులను వాడుతూ ఉంటారు. ఇంకా అలాగే పార్లర్ కి వెళ్లి జుట్టుకు సంబంధించిన వివిధ రకాల ట్రీట్ మెంట్ లను కూడా తీసుకుంటారు.చాలా హెయిర్ స్టైల్స్ ను కూడా ప్రయత్నిస్తూ ఉంటారు.అందుకోసం డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఇలా పార్లర్ వెళ్లే పని లేకుండా డబ్బు ఖర్చు చేసే పని లేకుండా ఇంట్లోనే జుట్టును అందంగా ఇంకా మృదువుగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కాను వాడడం వల్ల సెలూన్ లాంటి హెయిర్ లుక్ ను మీరు ఈHair tips{#}Egg;Vitamin;Mixie;Banana;Manamఇలా చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది?ఇలా చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది?Hair tips{#}Egg;Vitamin;Mixie;Banana;ManamMon, 09 Oct 2023 20:44:00 GMTజుట్టు అందంగా, పట్టుకుచ్చులా మెరవాలని ఇంకా మృదువగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం చాలా రకాల షాంపులను వాడుతూ ఉంటారు. ఇంకా అలాగే పార్లర్ కి వెళ్లి జుట్టుకు సంబంధించిన వివిధ రకాల ట్రీట్ మెంట్ లను కూడా తీసుకుంటారు.చాలా హెయిర్ స్టైల్స్ ను కూడా ప్రయత్నిస్తూ ఉంటారు.అందుకోసం డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఇలా పార్లర్ వెళ్లే పని లేకుండా డబ్బు ఖర్చు చేసే పని లేకుండా ఇంట్లోనే జుట్టును అందంగా ఇంకా మృదువుగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కాను వాడడం వల్ల సెలూన్ లాంటి హెయిర్ లుక్ ను మీరు ఈజీగా ఇంట్లోనే పొందవచ్చు. అలాగే ఈ చిట్కాను వాడడం వల్ల జుట్టు అందంగా మారడంతో పాటు జుట్టు ఒత్తుగా అలాగే పొడవుగా పెరుగుతుంది.ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి  మనం ఒక అరటిపండును, ఒక కోడిగుడ్డును, అర చెక్క నిమ్మరసాన్ని, రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనెను, ఒక విటమిన్ ఇ క్యాప్సుల్ ను వాడాల్సి ఉంటుంది.


ముందుగా మీరు ఒక జార్ లో అరటిపండు గుజ్జు, కోడిగుడ్డు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో నిమ్మరసం, కొబరినూనె, విటమిన్ ఇ క్యాప్సుల్ వేసి 10 నిమిషాల పాటు అంతా కలిసేలా బాగా కలపాలి.ఇక ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా బాగా పట్టించాలి. ఆ తరువాత పది నిమిషాల పాటు బాగా మర్దనా చేసుకోవాలి. దీనిని ఆరే దాకా అలాగే ఉంచి ఆ తరువాత షాంపు ఇంకా కండీషనర్ ను వాడి తలస్నానం చేయాలి.ఇక మీ జుట్టు ఆరిన తరువాత సీరమ్ ను రాసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చక్కటి మృదువైన, పట్టుకుచ్చులాంటి జుట్టును మీరు చాలా సులభంగా పొందవచ్చు. ఈ టిప్ ని వాడిన రెండు వారాల్లోనే జుట్టులో వచ్చిన మార్పును మీరు ఈజీగా చూడవచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ని మీరు ట్రై చెయ్యండి. మీ జుట్టు చాలా అందంగా నల్లగా మెరిసిపోతుంది. అలాగే జుట్టు రాలే సమస్య కూడా చాలా ఈజీగా తగ్గిపోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దిల్ రాజు ఇంట మరో తీవ్ర విషాదం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>