Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2be3a333-24d9-4c0f-92ec-afb980b98fff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2be3a333-24d9-4c0f-92ec-afb980b98fff-415x250-IndiaHerald.jpgతాను హీరోగా నటించిన 'అఖండ' సినిమా విడుదల విషయంలో ప్రభుత్వాలు సహకరించలేదని నందమూరి బాలకృష్ణ అన్నారు.'భగవంత్‌ కేసరి' సినిమా ట్రైలర్‌ విడుదల వేడుకలో ఆయన మాట్లాడారు. బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రమిది. కాజల్‌ కథానాయిక. నటి శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో ఈవెంట్‌ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దర్శకులు గోపీచంద్‌ మలినేని, బాబీ, వంశీ పైడిపల్లి హాజరయ్యారు. వేడుకనుద్దేశించి బాలకృషsocialstars lifestyle{#}Nalgonda;vamsi paidipally;Balakrishna;Dussehra;Vijayadashami;Telangana;Film Industry;Cinema;Audienceఆ కారణంగా బాలయ్య పై కోప్పడ్డ మోక్షజ్ఞ...!!ఆ కారణంగా బాలయ్య పై కోప్పడ్డ మోక్షజ్ఞ...!!socialstars lifestyle{#}Nalgonda;vamsi paidipally;Balakrishna;Dussehra;Vijayadashami;Telangana;Film Industry;Cinema;AudienceMon, 09 Oct 2023 07:25:00 GMTతాను హీరోగా నటించిన 'అఖండ' సినిమా విడుదల విషయంలో ప్రభుత్వాలు సహకరించలేదని నందమూరి బాలకృష్ణ అన్నారు.'భగవంత్‌ కేసరి' సినిమా ట్రైలర్‌ విడుదల వేడుకలో ఆయన మాట్లాడారు. బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రమిది. కాజల్‌ కథానాయిక. నటి శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో ఈవెంట్‌ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దర్శకులు గోపీచంద్‌ మలినేని, బాబీ, వంశీ పైడిపల్లి హాజరయ్యారు.

వేడుకనుద్దేశించి బాలకృష్ణ మాట్లాడుతూ.. ''పోరాటాల పురిటి గడ్డగా పేరొందిన వరంగల్‌ ప్రజలు, నా అభిమానులందరికీ శుభాభినందనలు. నాకు వరంగల్‌తో అనుబంధం ఉంది. దసరా నవరాత్రులకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఆ భద్రకాళి అమ్మవారే నన్ను ఇక్కడికి రప్పించారనుకుంటున్నా. సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మలాంటి ఎందరో పోరాట యోధులను స్మరించుకుంటున్నా. పెండ్యాల రాఘవయ్య వరంగల్‌ ఎంపీగా, హనుమకొండ ఎమ్మెల్మేగా, వర్దన్నపేట ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 1984లో నందమూరి తారక రామారావు గుడివాడ, హిందూపూర్‌, నల్గొండ నుంచి పోటీ చేసి, మూడు చోట్లా విజయం సాధించారు. నేను ఈ సినిమాలో తెలంగాణ మాండలికంలో సంభాషణలు చెప్పా. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనమున్న సినిమాలు అందించాలనేదే నా తాపత్రయం. 'అఖండ' తర్వాత ఏం చేయాలనుకున్న తరుణంలో 'వీరసింహారెడ్డి'లో నటించా. అది ఘన విజయం అందుకుంది. తర్వాత ఏంటని అనుకుంటూ ఉండగా అనిల్‌ రావిపూడి ఈ కథ చెప్పారు. ట్రైలర్‌లో మీరు చూసింది కొంతే. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. అదంతా దాచి పెట్టాం. దసరా ముందు దంచుదాం. కొత్త సినిమా చేసేముందు నేను నా పాత చిత్రాల గురించి దర్శకులతో చర్చించను. ప్రతి సినిమాని సవాలుగా స్వీకరిస్తా. చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు నేను చేయగలిగానంటే దానికి కారణం ఆయా సినిమా బృందాల సమష్టి కృషి''.

''అనిల్‌ రావిపూడి సెట్స్‌లో జోక్స్‌ వేసి నవ్విస్తూ ఉండేవాడు. కాజల్‌ మంచి నటి. ఆమెతో కలిసి నటించాలని ఎప్పటి నుంచో అనుకునేవాణ్ని. శ్రీలీల ఇందులో నాకు కుమార్తెగా నటించింది. తర్వాత సినిమాలో హీరోహీరోయిన్లుగా యాక్ట్‌ చేద్దామని ఆమెతో చెప్పా. ఇదే మాటను నా భార్య, కొడుకుతో కూడా పంచుకున్నా. 'ఏంటి డాడీ.. నేను హీరోగా రాబోతుంటే నువ్వేమో ఆమెకు ఆఫర్‌ ఇస్తావా?' అంటూ నాపై కోప్పడ్డాడు'' అని నవ్వులు పంచారు.''సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే మీమాంసలో చిత్ర పరిశ్రమ ఉన్న సమయంలో 'అఖండ'ను విడుదల చేశాం. ప్రభుత్వాలు మాకేం సహకరించలేదు. అదనపు షోలు లేవు. టికెట్‌ రేట్లు పెంచలేదు. ప్రేక్షకులు తరలి వచ్చారు. రికార్డు సృష్టించిందా చిత్రం. పారిశ్రామిక రంగాన్ని ఎలా గుర్తిస్తారో చిత్ర పరిశ్రమను ప్రభుత్వాలు అలాగే గుర్తించాలి. అప్పుడే ప్రభుత్వాలకు మంచి ఆదాయం వస్తుంది'' అని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరోసారి అలా రెచ్చిపోయిన అనసూయ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>