EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawanf267207d-3db4-4dbf-9b11-e9d40ab84d38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawanf267207d-3db4-4dbf-9b11-e9d40ab84d38-415x250-IndiaHerald.jpgటిడిపి హయాంలో ఎన్టీ రామారావు మద్య నిషేధం అనే విధానాన్ని తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాన్ని ఒక సంచలనంగా మార్చారు. దేశవ్యాప్తంగా ఎక్కడ లేని మద్య నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి మందుబాబులకు కొరకరాని కొయ్యలా మారారు. దీని ద్వారా తెలుగింటి ఆడపడుచులు ఎక్కువమంది ఎన్టీఆర్ పై అభిమానం చూపించారు. ఎన్టీఆర్ మద్య నిషేధం ప్రవేశపెట్టడం వల్ల ఎంతో మంది మహిళలు టిడిపి పార్టీకి ఆకర్షితులయ్యారు. చాలామంది టీడీపీ వల్ల తమ కుటుంబాలు బాగుపడ్డాయని అది కేవలం మద్యం నిషేధించడం వల్ల అని టిడిపికి అనుకూలంగా ఓటేశారు. టిడిపినPAWAN{#}kalyan;Janasena;NTR;TDP;CM;Teluguఇక పవన్‌కే మందుబాబులు ఓట్లు గుద్దేస్తారా?ఇక పవన్‌కే మందుబాబులు ఓట్లు గుద్దేస్తారా?PAWAN{#}kalyan;Janasena;NTR;TDP;CM;TeluguMon, 09 Oct 2023 07:00:00 GMTటిడిపి హయాంలో ఎన్టీ రామారావు మద్య నిషేధం అనే విధానాన్ని తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాన్ని ఒక సంచలనంగా మార్చారు. దేశవ్యాప్తంగా ఎక్కడ లేని మద్య నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి మందుబాబులకు కొరకరాని కొయ్యలా మారారు. దీని ద్వారా తెలుగింటి ఆడపడుచులు ఎక్కువమంది ఎన్టీఆర్ పై అభిమానం చూపించారు. ఎన్టీఆర్ మద్య నిషేధం ప్రవేశపెట్టడం వల్ల ఎంతో మంది మహిళలు టిడిపి పార్టీకి ఆకర్షితులయ్యారు.


చాలామంది టీడీపీ వల్ల తమ కుటుంబాలు బాగుపడ్డాయని అది కేవలం మద్యం నిషేధించడం వల్ల అని  టిడిపికి అనుకూలంగా ఓటేశారు. టిడిపిని ఎంతో అభిమానించారు, ఆరాధించారు. ఇలాంటి నాయకుడి వల్ల తమ కుటుంబాలు బాగుపడ్డాయని సంతోషించారు. అలాంటి మద్య నిషేధాన్ని తదనంతర కాలంలో అధికారం చేపట్టినటువంటి పార్టీలు రోజురోజుకు మద్యాన్ని మరింత పెంచుతూ రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి మాత్రమే ప్రాధాన్యమిస్తున్నాయి.


మద్యంతోనే రాష్ట్ర ప్రభుత్వాలు నడిచే పరిస్థితి ఉన్నదంటే అతిశయోక్తి కాదు. అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత సీఎం జగన్ గత ఎన్నికల్లో ఐదు విడత ల్లో పూర్తిగా రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలు విడతల వారీగా 20, 20 శాతం తగ్గించారు.


కానీ మూడో సంవత్సరం నుంచి నిషేధంపై దృష్టి సాధించలేరు. అది అమలు చేయడం అసాధ్యమని జోలికి పోవడం లేదు. దీనితోనే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మద్య నిషేధం చేస్తానని చెప్పినటువంటి సీఎం జగన్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తూనే మేము అధికారంలోకి వస్తే క్వాలిటీ మద్యాన్ని ప్రజలకు అందిస్తామని చెబుతున్నారు. నిషేధం చేస్తామని చెప్పడం లేదు. కానీ ప్రజల ఆరోగ్యం లేటుగా చెడిపోయేలా క్వాలిటీ మద్యం అందిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. మద్యనిషేధం చెప్పడం అటు ఉంచి క్వాలిటీ మద్యాన్ని అందిస్తామని చెప్పడం ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి చెల్లింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరోసారి అలా రెచ్చిపోయిన అనసూయ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>