LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips-for-good-health-and-long-life5b31d59a-9220-44ab-bb8a-6b14b148ea7f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips-for-good-health-and-long-life5b31d59a-9220-44ab-bb8a-6b14b148ea7f-415x250-IndiaHerald.jpgమనం వంటల్లో అల్లం వెల్లుల్లిని ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇవి రెండు కూడా చాలా ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.వీటిని వంటల్లో వాడడంతో పాటుగా అల్లం వెల్లుల్లితో మనం ఎంతో రుచిగా ఉండే సూప్ ను కూడా తయారు చేసుకోవచ్చు. జలుబు, దగ్గు, జ్వరం ఇంకా ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఈ సూప్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. ఇక వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ సూప్ ను తయారు చేసుకుని వేడి వేడిగా తాగితే చాలా హాయిగా ఉంటుంది. ఈ సూప్ ను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఇంకా అలాగే 10 నిమిషాల్లHealth{#}Ginger;garlic;salt;Gas Stove;Ghee;Coriander.;Manamఈ సూప్ తాగితే మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు?ఈ సూప్ తాగితే మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు?Health{#}Ginger;garlic;salt;Gas Stove;Ghee;Coriander.;ManamMon, 09 Oct 2023 21:35:35 GMTమనం వంటల్లో అల్లం వెల్లుల్లిని ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇవి రెండు కూడా చాలా ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.వీటిని వంటల్లో వాడడంతో పాటుగా అల్లం వెల్లుల్లితో మనం ఎంతో రుచిగా ఉండే సూప్ ను కూడా తయారు చేసుకోవచ్చు. జలుబు, దగ్గు, జ్వరం ఇంకా ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఈ సూప్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. ఇక వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ సూప్ ను తయారు చేసుకుని వేడి వేడిగా తాగితే చాలా హాయిగా ఉంటుంది. ఈ సూప్ ను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఇంకా అలాగే 10 నిమిషాల్లోనే దీనిని తయారు చేసుకోవచ్చు. ఘాటుగా, రుచిగా ఇంకా వేడి వేడిగా అల్లం వెల్లుల్లితో సూప్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ముందుగా రోట్లో వెల్లుల్లి రెబ్బలు ఇంకా అల్లం వేసి కచ్చా పచ్చాగా దంచుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ తరువాత అదే రోట్లో మిరియాలు కూడా వేసి కచ్చా పచ్చాగా దంచుకుని పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని అందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకుని ఒక పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నెయ్యిని వేసి వేడి చేయాలి. ఆ నెయ్యి కరిగిన తరువాత దంచిన అల్లం వెల్లుల్లి వేసి చిన్న మంటపై ఒక 2 నిమిషాల పాటు వేయించాలి.ఆ తరువాత క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. వీటిని మరో రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు, ఉప్పు ఇంకా మిరియాలు వేసి కలపాలి. వీటిని ఒక 5 నిమిషాల పాటు మరిగించిన తరువాత కార్న్ ఫ్లోర్ నీళ్లు వేసి కలపాలి. ఆ తరువాత ఈ సూప్ ను మరో 3 నిమిషాల పాటు మరిగించి, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే అల్లం వెల్లుల్లి సూప్ తయారవుతుంది.ఇక దీనిని వేడి వేడిగా తాగితే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా అల్లం వెల్లుల్లితో సూప్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దిల్ రాజు ఇంట మరో తీవ్ర విషాదం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>