SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/world-cup-20230f1311c5-fb75-4792-9956-af8d35738908-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/world-cup-20230f1311c5-fb75-4792-9956-af8d35738908-415x250-IndiaHerald.jpgటీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత జట్టుకు కెప్టెన్సీ వహించిన అతిపెద్ద వయస్కుడిగా రోహిత్‌ శర్మ రికార్డులకెక్కాడు.వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఆస్ట్రేలియా టీంతో తొలి మ్యాచ్‌ సందర్భంగా బరిలోకి దిగిన హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్‌ శర్మ 36 ఏళ్ల 161 రోజుల వయసులో ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇండియాకి నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి దాకా ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్‌ మొహమ్మద్ అజారుద్దీన్ (36 ఏళ్ల 124 రోజులు) పేరిట ఉWorld Cup 2023{#}Rohit Sharma;Australia;INTERNATIONALWorld Cup 2023: రోహిత్ సూపర్ రికార్డ్.. కోహ్లీ సూపర్?World Cup 2023: రోహిత్ సూపర్ రికార్డ్.. కోహ్లీ సూపర్?World Cup 2023{#}Rohit Sharma;Australia;INTERNATIONALSun, 08 Oct 2023 18:16:59 GMTటీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత జట్టుకు కెప్టెన్సీ వహించిన అతిపెద్ద వయస్కుడిగా రోహిత్‌ శర్మ రికార్డులకెక్కాడు.వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఆస్ట్రేలియా టీంతో తొలి మ్యాచ్‌ సందర్భంగా బరిలోకి దిగిన హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్‌ శర్మ 36 ఏళ్ల 161 రోజుల వయసులో ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇండియాకి నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి దాకా ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్‌ మొహమ్మద్ అజారుద్దీన్ (36 ఏళ్ల 124 రోజులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో అజారుద్దీన్ ఆల్‌టైమ్‌ రికార్డును రోహిత్‌ శర్మ బ్రేక్‌ చేశాడు.రోహిత్‌ శర్మ తర్వాత స్ధానాల్లో వరుసగా అజారుద్దీన్‌, రాహుల్‌ ద్రవిడ్‌ (34 ఏళ్ల 71 రోజులు), ఎస్‌ వెంకటరాఘవన్‌(34 ఏళ్ల 56 రోజులు) ఇంకా ఎంఎస్‌ ధోని(33 ఏళ్ల 262 రోజులు) ఉన్నారు. ఇక రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు.


ఈ మ్యాచ్‌లో మరో 2 సిక్స్‌లు కనుక బాదితే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ను రోహిత్‌ శర్మ అధిగమిస్తాడు. గేల్‌ ఇప్పటి దాకా 553 సిక్స్‌లు బాదగా.. రోహిత్‌ శర్మ మొత్తం 551 సిక్స్‌లు కొట్టాడు.ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాతో జరగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి అద్బుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్‌ టీం ఇన్నింగ్స్‌ 3 ఓవర్‌ వేసిన జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో మిచెల్‌ మార్ష్‌ డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు.అయితే ఆ బంతి ఔట్‌ సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని స్లిప్స్‌ దిశగా వెళ్లింది.ఇంకా ఈ క్రమంలో సెకెండ్‌ స్లిప్‌లో కోహ్లి డైవ్‌ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా మార్ష్‌ బిత్తరపోవడం జరిగింది. ఇక కోహ్లి దెబ్బకు మార్ష్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. కోహ్లి క్యాచ్‌కు సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.
" style="height: 656px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇజ్రాయెల్ యుద్ధం నుంచి బయటపడ్డ బాలీవుడ్ నటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>