MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/israelabe1de5f-b8a8-4f33-a0e1-89e3531615de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/israelabe1de5f-b8a8-4f33-a0e1-89e3531615de-415x250-IndiaHerald.jpgఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. హమాస్ ఇజ్రాయెల్ పై దారుణంగా బాంబుల వర్షం కురిసిస్తోంది. ఈ మారణహోమంలో ఇప్పటికే ఇరుదేశాల్లో మొత్తం 500 మందికి పైగా దుర్మరణం చెందగా అందులో వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. రాకెట్‌ కాల్పులు, సైరన్‌ శబ్దాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక రెండు దేశాల్లో ప్రజలు భయపడుతూ గడుపుతున్నారు. వేలాదిమంది భారతీయ విద్యార్థులు కూడా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా ఇజ్రాయెల్లో చIsrael{#}Pranay;Thriller;Israel;war;students;bollywood;Varsham;Saturday;News;Cinemaఇజ్రాయెల్ యుద్ధం నుంచి బయటపడ్డ బాలీవుడ్ నటి?ఇజ్రాయెల్ యుద్ధం నుంచి బయటపడ్డ బాలీవుడ్ నటి?Israel{#}Pranay;Thriller;Israel;war;students;bollywood;Varsham;Saturday;News;CinemaSun, 08 Oct 2023 23:14:41 GMTఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. హమాస్ ఇజ్రాయెల్ పై దారుణంగా బాంబుల వర్షం కురిసిస్తోంది. ఈ మారణహోమంలో ఇప్పటికే ఇరుదేశాల్లో మొత్తం 500 మందికి పైగా దుర్మరణం చెందగా అందులో వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. రాకెట్‌ కాల్పులు, సైరన్‌ శబ్దాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక రెండు దేశాల్లో ప్రజలు భయపడుతూ గడుపుతున్నారు. వేలాదిమంది భారతీయ విద్యార్థులు కూడా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా ఇజ్రాయెల్లో చిక్కుకుపోయారన్న వార్త ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఈమధ్యనే హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఆమె ఆ దేశానికి వెళ్లారు. అయితే నుష్రత్ కు ఆమె టీమ్ తో సంబంధాలనేవి పూర్తి తెగిపోయాయి. ఇక ఆమె జాడ కోసం టీమ్ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.


తెలుస్తున్న సమాచారం ప్రకారం నుష్రత్ భరూచాకు, ఆమె టీమ్ కు మధ్య చివరి సారిగా శనివారం నాడు మధ్యాహ్నం 12.30 గంటలకు చివరి సారిగా కాల్ లో మాట్లాడడం జరిగింది. ఇక అప్పుడు ఆమె బేస్మెంట్లో అందరితో పాటు సురక్షితంగా ఉన్నానని తన టీమ్ మెంబర్ కు తెలిపింది. తరువాత ఆమె నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ అనేది లేదు. కాల్‌ కనెక్ట్‌ కాకపోవడంతో ఆమె భద్రతపై అనుమానాలు పెరిగాయి. నుష్రత్ ను సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని టీమ్ మెంబర్ పేర్కొన్నారు. అయితే నుష్రత్ ఆచూకీ తెలిసిందని ఎంబసీ సహాయంతో ఆమె కాంటాక్ట్లోకి వచ్చిందని, ఆమె అక్కడ సురక్షితంగా ఉందని.. ప్రొడక్షన్ మెంబర్ ఒకరు తెలిపడం జరిగింది. ఇక నుష్రత్.. భారత్కు తిరిగి వచ్చినట్టు సమాచారం తెలుస్తోంది.ఇక నుష్రత్ భరూచా.. చివరిసారిగా ప్రణయ్ మెష్రామ్ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ డ్రామా అకెల్లిలో నటించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇజ్రాయెల్ యుద్ధం నుంచి బయటపడ్డ బాలీవుడ్ నటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>