Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc5fc0fe52-aaaa-4784-bcab-e2753f8c9471-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc5fc0fe52-aaaa-4784-bcab-e2753f8c9471-415x250-IndiaHerald.jpgపురుషుల ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే... ప్రపంచ కప్ అనేది క్రికెట్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్, ఇక్కడ అత్యుత్తమ జట్లు ప్రపంచ స్థాయిలో కీర్తి కోసం పోటీపడతాయి. ఒక బ్యాటర్ సెంచరీ సాధించడం, ఒకే ఇన్నింగ్స్‌లో 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఆటలోని అత్యంత ఉత్కంఠభరితమైన అంశాలలో ఒకటి. అయితే, అన్ని సెంచరీలు సమానంగా ఉండవు. కొంతమంది బ్యాటర్లు ఈ ఫీట్‌ను ఇతరుల కంటే వేగంగా సాధిస్తారు. వారు బ్యాటింగ్ లో నైపుణ్యం, శక్తి, దూకుడును ప్రదర్శిస్తారు. ఈ ఆర్టికల్ లోIcc{#}kirti;Cricketపురుషుల ప్రపంచకప్ చరిత్రలో.. అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే?పురుషుల ప్రపంచకప్ చరిత్రలో.. అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే?Icc{#}kirti;CricketSun, 08 Oct 2023 16:15:00 GMT

ప్రపంచ కప్ అనేది క్రికెట్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్, ఇక్కడ అత్యుత్తమ జట్లు ప్రపంచ స్థాయిలో కీర్తి కోసం పోటీపడతాయి. ఒక బ్యాటర్ సెంచరీ సాధించడం, ఒకే ఇన్నింగ్స్‌లో 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఆటలోని అత్యంత ఉత్కంఠభరితమైన అంశాలలో ఒకటి. అయితే, అన్ని సెంచరీలు సమానంగా ఉండవు. కొంతమంది బ్యాటర్లు ఈ ఫీట్‌ను ఇతరుల కంటే వేగంగా సాధిస్తారు. వారు బ్యాటింగ్ లో నైపుణ్యం, శక్తి, దూకుడును ప్రదర్శిస్తారు. ఈ ఆర్టికల్ లో పురుషుల ప్రపంచ కప్ చరిత్రలో చాలా ఫాస్ట్ గా సెంచరీలు చేసిన ప్లేయర్లు ఎవరో తెలుసుకుందాం.

నిన్నటి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్రామ్ కి శ్రీలంకపై 49 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. దాంతో అతడే అది తక్కువ బంతుల్లో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డ్ బ్రేక్ చేశాడు.

అతని తర్వాత ఐర్లాండ్‌కు చెందిన కెవిన్ ఓ'బ్రియన్ అనే ఆటగాడు అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ ప్లేయర్ 2011లో 50 బంతుల్లో సెంచరీ సాధించి ఇంగ్లండ్‌ను మట్టికరిపించాడు.

ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్ 2015లో శ్రీలంక, వెస్టిండీస్‌పై వరుసగా 51, 52 బంతుల్లో సెంచరీ స్కోర్ చేశారు. ఆ రికార్డు క్రియేటింగ్ ఫీట్ తో ఈ జాబితాలో మూడవ, నాల్గవ స్థానాలను ఆక్రమించారు. 2019లో ఆఫ్ఘనిస్తాన్‌పై 57 బంతుల్లో సిక్సర్లు, ఫోర్లు దంచి కొడుతూ ఇంగ్లాండ్‌కు చెందిన ఇయాన్ మోర్గాన్ సెంచరీ చేశాడు. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాళ్లలో ఐదవ స్థానం దక్కించుకున్నాడు.

2007లో మాథ్యూ హేడెన్ దక్షిణాఫ్రికాపై 66 బంతుల్లో సెంచరీ సాధించి ఈ లిస్టులో చేరాడు.  కెనడియన్ ప్లేయర్ డెవిసన్ 67 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. 2015లో స్కాట్లాండ్‌పై 70 బంతుల్లో శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర 100 పరుగులు తీశాడు. కపిల్ దేవ్ 1983లో జింబాబ్వేపై 72 బంతులు మెరుపు వేగంతో సెంచరీ సాధించాడు.

ఈ బ్యాటర్లు ప్రపంచ కప్‌లో తమ క్లాస్, ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. వారి సెంచరీలు చిరకాలం గుర్తుండిపోతాయి. పురుషుల ప్రపంచకప్ చరిత్రలో ఇవి తొమ్మిది వేగవంతమైన సెంచరీలు. వీరు ఈ సెంచరీలతో అభిమానులను అలరించారు, భవిష్యత్ తరాల క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చారు. ఎవరికి తెలుసు, బహుశా వచ్చే ప్రపంచకప్‌లో ఎవరైనా మార్క్రామ్ రికార్డును బ్రేక్ చేయవచ్చు. ఈ బెంచ్ మార్కును మరింత పెంచవచ్చు. అది ఎవరనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి తమిళ ప్రేక్షకులు ఫిదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>