DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/cbn92e15c4b-b4ce-4b7f-b424-0a84b3509b72-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/cbn92e15c4b-b4ce-4b7f-b424-0a84b3509b72-415x250-IndiaHerald.jpgస్కిల్ డెవలప్ మెంట్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో చంద్రబాబు కి ఏం సంబంధం అని అతని తరఫు లాయర్లు ప్రశ్నిస్తుంటే.. చంద్రబాబే ప్రధాన సూత్ర ధారి అని సీఐడీ వాదిస్తోంది. దారి మళ్లించిన స్కిల్ డెవలప్మెంట్ నిధులు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకే తిరిగి చేరాయని వారు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన రూ.27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్ మెంట్లు, రికార్డులను సీఐడీ తరఫున అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏసీబీ న్యాయస్థానం ముందుంచారు. దీనిపై ఆయన వాదనలు వినిపిస్తూ రూ.27 కోట్లు టీడీపీ cbn{#}sudhakar;contract;Party;Anti-Corruption Bureau;TDP;CBN;Governmentఆ రూ. 27 కోట్లు.. చంద్రబాబు కొంప ముంచాయా?ఆ రూ. 27 కోట్లు.. చంద్రబాబు కొంప ముంచాయా?cbn{#}sudhakar;contract;Party;Anti-Corruption Bureau;TDP;CBN;GovernmentSun, 08 Oct 2023 09:00:00 GMTస్కిల్ డెవలప్ మెంట్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో చంద్రబాబు కి ఏం సంబంధం అని అతని తరఫు లాయర్లు ప్రశ్నిస్తుంటే.. చంద్రబాబే ప్రధాన సూత్ర ధారి అని సీఐడీ వాదిస్తోంది. దారి మళ్లించిన స్కిల్ డెవలప్మెంట్ నిధులు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకే తిరిగి చేరాయని వారు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన రూ.27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్ మెంట్లు, రికార్డులను సీఐడీ తరఫున అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏసీబీ న్యాయస్థానం ముందుంచారు.

దీనిపై ఆయన వాదనలు వినిపిస్తూ  రూ.27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాలోకి చేరడం చిన్న విషయం కాదని.. దీనిపై విచారించేందుకు టీడీపీ ఆడిటర్ ను ఈ నెల 10న సీఐడీ విచారణకు పిలిచిందని తెలిపారు. నిధుల విడుదలకు అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి లిఖిత పూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను న్యాయస్థానానికి సమర్పించారు.

ముందుగా ప్రభుత్వం సీమెన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎంవోయూలో డిజైన్ టెక్ తో పాటు స్కిల్లర్ ఉంది. ఇది నెలరోజుల ముందు ప్రారంభించిన సంస్థ.  ఇక్కడి నుంచి డబ్బులు బోగస్ కంపెనీలకు వెళ్లాయి.  అందులో నుంచి ఓ కంపెనీ నుంచి రూ.27 కోట్లు టీడీపీ అకౌంట్లో వచ్చి పడ్డాయి.  


ఈ ఆధారాలను పరిశీలిస్తుంటే సీఐడీ ఈ కేసుపై లోతైన విచారణ జరిపినట్లు కనిపిస్తోంది. డబ్బులు వెళ్లిన తీరును కనుక్కొని వాటి ఆధారాలు సేకరించారు. ఇప్పుడు మరో కొత్త అంశం ఏమిటంటే ఎఫ్ఐఆర్ లో టీడీపీ పేరు కూడా చేరుస్తారా.. లిక్కర్ కుంభకోణంలో ఈడీ అదే ప్రశ్నించింది. రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లాయని అంటున్నారు. అయితే మనీశ్ సిసోదియా కి ఏం సంబంధం. పార్టీ అధ్యక్షుడు బాధ్యత వహించాలి కదా.. పార్టీని ఎందుకు ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు అని ప్రశ్నించింది. ఇప్పుడు టీడీపీని కూడా చేరుస్తారా లేదా అంటే వేచి చూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన శ్రద్ధా శ్రీనాథ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>